• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • KNOW THE DETAILS ABOUT POP SINGER RIHANNA ASSETS WHO SUPPORTED FARMERS PROTEST IN INDIA AK GH

Rihanna: రైతు ఉద్యమానికి మద్దతునిచ్చిన పాప్ సింగర్ రిహాన్నా ఆస్తి విలువ ఎంతో తెలుసా..

Rihanna: రైతు ఉద్యమానికి మద్దతునిచ్చిన పాప్ సింగర్ రిహాన్నా ఆస్తి విలువ ఎంతో తెలుసా..

రిహానా (Image; Tiwtter)

Pop Singer Rihanna: రిహానా చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించింది. రిహాన్నా యవ్వనంలో ఉన్నప్పుడు జీవనోపాధి కోసం తన తండ్రితో పాటు టోపీలు, బెల్టులను విక్రయించేది.

  • Share this:
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న విషయం తెలిసిందే. గత రెండు నెలల నుంచి సాగుతున్న ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రెటీలు మద్దతునిస్తుండగా.. ఇప్పడు అంతర్జాతీయ ప్రముఖులు సైతం రైతుల దీక్షకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ట్విట్టర్లో 101 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్న ప్రముఖ బార్బేరియన్ సింగర్, నటి వ్యాపారవేత్త రిహన్నా (32) సైతం రైతులు చేస్తున్న ఉద్యమంపై స్పందించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్లో రైతుల ఉద్యమానికి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ క్లిప్‌ను జతచేసి.. ‘‘భారత్‌లో జరుగుతున్న రైతు ఉద్యమం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం లేదు.’’ అంటూ ట్వీట్ చేసింది. రిహన్నా ట్వీట్‌కు మద్దతుగా పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్, నటుడు జాన్ కుసాక్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్, -అమెరికన్ మోడల్, పోర్న్ స్టార్ మియా ఖలీఫా వంటి స్టార్లు కూడా రైతు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాత్రం రిహాన్నాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం చేస్తోంది రైతులు కాదని.. దేశాన్ని విభజించాలనుకుంటున్న ఉగ్రవాదులంటూ ఘాటుగా స్పందించారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్చంద కార్యక్రమాలు..
భారత్‌లో జరుగుతున్న రైతు ఉద్యమంపై అంతర్జాతీయ పాపులర్ సింగర్ రిహన్నా స్పందించడంతో ఇప్పుడు నెటిజన్ల దృష్టి ఆమెపై పడింది. ఆమె గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అమెరికాకు చెందిన పాప్ సింగర్ రిహన్నా నికర ఆస్తి విలువ అక్షరాలా 600 మిలియన్ డాలర్ల పైమాటే(మన కరెన్సీ ప్రకారం రూ. 4300 కోట్లు). ఆమె సింగర్‌ మాత్రమే కాదు.. వ్యాపారవేత్త కూడా, మానవతావాది కూడా. ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

అల్జీమర్స్ అసోసియేషన్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఫౌండేషన్, డిజైనర్స్ ఎగైనెస్ట్ ఎయిడ్స్, ష్రినర్స్ హాస్పిటల్స్ ఫర్ చిల్డ్రన్, స్టాండ్ అప్ టు క్యాన్సర్, బ్లాక్ ఐడ్ పీస్ ఫౌండేషన్, యునిసెఫ్ సహా అనేక స్వచ్ఛంద సంస్థలకు ఆమె మద్దతిచ్చింది. కరోనావైరస్ ఉపశమనం కోసం 5 మిలియన్లను విరాళంగా ఇచ్చింది. రిహాన్న తన సంస్థ క్లారా అండ్ లియోనెల్ ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఈ ఫౌండేషన్ 60 దేశాలలో యువ విద్యార్థుల విద్యకు నిధులు సమకూరుస్తుంది. 2017 లో, ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది.

పేదరికం నుండి పాప్ సింగర్‌గా..
బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో రాబిన్ రిహన్నా ఫెంటీ జన్మించింది. ఆమె చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించింది. రిహాన్నా యవ్వనంలో ఉన్నప్పుడు జీవనోపాధి కోసం తన తండ్రితో పాటు టోపీలు, బెల్టులను విక్రయించేది. తన పేదరికాన్ని దాటుకొని ఎన్నో కష్టాలు పడి పాప్ సింగర్‌గా ఎదిగింది. రిహన్నా పాప్ సింగర్‌గా తన కెరీర్‌ను 17 ఏళ్ళలో ప్రారంభించింది. ఆమె 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన మొదటి స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. 2005లో విడుదలైన ఆమె మొట్టమొదటి ఆల్బం ‘మ్యూజిక్ ఆఫ్ ది సన్’ 2 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైంది.
Published by:Kishore Akkaladevi
First published:

అగ్ర కథనాలు