దీన్ని దరిద్రం అనాలా? ఏమనాలి?.. 6 నెలల క్రితం ప్రపంచ కోటీశ్వరుల్లో ఒకడు.. ఇప్పుడు..

ప్రతీకాత్మక చిత్రం

మొదట్లో ఆయన స్కూల్ టీచర్‌గా పని చేసేవాడు. తరువాత గౌటు టెక్ ఎడ్యు (Gaotu Techedu Inc) అనే ఓ ఆన్‌లైన్ ట్యుటోరియల్ సర్వీస్ సెంటర్‌ను స్థాపించాడు. అయితే ఇది 7 సంవత్సరాల సమయంలోనే అతి పెద్ద ప్రైవేట్ విద్యాసంస్థగా అవతరించింది.

  • Share this:
బిజినెస్‌లో నష్టం వస్తే కోటీశ్వరులు కూడా బిచ్చగాళ్ళు అవుతారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మాటలు ఒక చైనా ఉపాధ్యాయుడి విషయంలో దాదాపు నిజమయ్యాయి. ఆరు నెలల క్రితం కుబేరుడిగా గుర్తింపు దక్కించుకున్న ఆ టీచర్.. ఇప్పుడు లక్షాధికారి హోదాకు మాత్రమే పరిమితమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ల్యారీ చెన్ అనే ఒక వ్యక్తి చైనాలోని ఒక కుగ్రామంలో నివసించేవాడు. మొదట్లో ఆయన స్కూల్ టీచర్‌గా పని చేసేవాడు. తరువాత గౌటు టెక్ ఎడ్యు (Gaotu Techedu Inc) అనే ఓ ఆన్‌లైన్ ట్యుటోరియల్ సర్వీస్ సెంటర్‌ను స్థాపించాడు. అయితే ఇది 7 సంవత్సరాల సమయంలోనే అతి పెద్ద ప్రైవేట్ విద్యాసంస్థగా అవతరించింది. ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో కూడా రిజిస్టర్ అయ్యింది. 2021 జనవరి నెలలో దీని స్టాక్ ప్రైస్ 149 డాలర్లకు చేరుకుంది. దీంతో ఆ సంస్థ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ల్యారీ చెన్ అత్యంత సంపన్నుడు అయ్యాడు. కానీ కొన్ని నెలల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి.

జులై 23న.. గత శుక్రవారం రోజున ఆయన సంస్థలోని మూడింట రెండు వంతుల షేర్స్ పతనం అయ్యాయి. దీంతో గంటల వ్యవధిలోనే ల్యారీ చెన్ తన బిలియనీర్ స్టేటస్ కోల్పోయారు. 6 నెలల క్రితం ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరిగా ఉన్నారు. కానీ ఇప్పుడు వేల కోట్ల డాలర్లను కోల్పోయారు. ప్రస్తుతం ఆయన ఆస్తి 336 మిలియన్ల డాలర్లు మాత్రమే..! ఈ విషయాన్ని తాజాగా ‘బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌’ వెల్లడించింది.

ఆయన షేర్లు ఘోరంగా పతనం కావడానికి చైనా కొత్త నిబంధనలే కారణమని చెప్పుకోవచ్చు. పాఠ్యాంశాలను బోధించే ఏ సంస్థలు కూడా లాభాలను ఆర్జించరాదు అన్నట్లు ఈ నిబంధనలు ఉన్నాయి. ఏ విద్యాసంస్థలైతే తమ మూలధనాన్ని పెంచడానికి ప్రయత్నిస్తాయో.. లేదా.. స్టాక్ మార్కెట్ వంటి వేదికల ద్వారా ప్రజల నుంచి డబ్బు తీసుకుంటాయో.. వాటన్నిటినీ బ్యాన్ చేస్తామని చెబుతూ చైనా శనివారం ‘న్యూ రెగ్యులేషన్స్’ విడుదల చేసింది. అయితే ఈ రెగ్యులేషన్ల గురించి ఒక రోజు ముందుగానే తెలుసుకున్న ల్యారీ చెన్ కంపెనీ పెట్టుబడిదారులు డబ్బును వెనక్కి తీసేసుకున్నారు. ఫలితంగా సదరు సంస్థ 15 బిలియన్ డాలర్లను నష్టపోయింది. ఒక బ్యాడ్ న్యూస్ స్టాక్ మార్కెట్లలో రిజిస్టర్ అయిన కంపెనీలను ఎలా షేక్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే చైనా చెప్పిన బ్యాడ్ న్యూస్ కారణంగా ఈసారి చెన్ పై కోలుకోలేని దెబ్బ పడింది. అయితే తమ విద్యా సంస్థ కొత్తగా ప్రకటించిన నిబంధనలను పాటిస్తుందని.. సామాజిక బాధ్యతలను నెరవేరుస్తుందని చెన్ శనివారం రోజు రాత్రి వీబో వేదికగా తెలిపారు.

చైనా కొత్త నిబంధనలతో మిగతా విద్యాసంస్థలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. న్యూయార్క్‌ స్టాక్ మార్కెట్ లో కంపెనీ షేర్లు 71% పడిపోవడంతో టాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ కూడా భారీ నష్టాలను ఎదుర్కొంది. ఈ విద్యా సంస్థ సీఈవో ఘంగ్ బ్యాంగ్‌సిన్ సంపద 2.5 బిలియన్ డాలర్ల నుంచి 1.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. న్యూ ఓరియంటల్ ఎడ్యుకేషన్ & టెక్నాలజీ గ్రూప్ ఇంక్ ఛైర్మన్ యు మిన్హాంగ్ కూడా బాగా నష్టపోయారు. పెద్ద విద్యాసంస్థలు పాఠ్యాంశాలు బాగా బోధిస్తామని చెప్పి విద్యార్థుల నుంచి బాగా డబ్బులు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనితో చైనా ప్రభుత్వం ఈ నిబంధనలను ప్రవేశపెట్టిందని తెలుస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published: