Kalpana Chawla: భారతీయ మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా జయంతి నేడు.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

కల్పనా చావ్లా (Image; Wikipedia)

ఆమె గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కారాన్ని 2003 నుంచి ఏటా ప్రకటిస్తోంది. దీన్ని వివిధ రంగాల్లోని 15 మంది శక్తివంతమైన మహిళలకు అందజేస్తుంది. కల్పన గౌరవార్థం దేశంలోని ఎన్నో విద్యాసంస్థలకు, స్కాలర్​షిప్​లకు, అవార్డులకు ఆమె పేరు పెట్టారు.

  • Share this:
అంతరిక్షంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా పుట్టిన రోజు నేడు. అంతరిక్షంలో ఏ చిన్న పొరపాటు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసి కూడా ధైర్యంగా ముందడుగు వేశారు కల్పనా. మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించిన ధీశాలి ఆమె.. తన జీవితం నేటి తరానికి ఎంతో స్పూర్తిదాయకం. పట్టుదల, కృషి, అంకితభావం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని ఆమె నిరూపించారు. కల్పనా చావ్లా హర్యానా రాష్ట్రంలోని కర్నాల్​ అనే గ్రామంలో 1962, మార్చి 17న జన్మించారు. చిన్నతనం నుంచే విమానాలు, ఎగురుతున్న వస్తువులంటే ఎంతో ఆసక్తి కనబర్చేవారు. ఆమె తన స్కూల్​ విద్యను కర్నాల్​లోని ఠాగూర్​ పబ్లిక్​ స్కూల్​లో పూర్తిచేశారు. ఆ తర్వాత పంజాబ్​ ఇంజినీరింగ్​ కాలేజీలో ఏరోనాటికల్​ ఇంజినీరింగ్​ పూర్తి చేసి.. మాస్టర్స్​ కోసం అమెరికా వెళ్లారు. 1984లో అమెరికాలోని టెక్సాన్​ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్​ డిగ్రీ పొందారు. 1986లో చావ్లా ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​లో తన పీహెచ్​డీ చేశారు.

1988లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన అమెస్​ రీసెర్చ్​ సెంటర్​లో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ నాసాకు వైస్​ ప్రెసిడెంట్​గానూ సేవలు అందించారు. 1991 ఏప్రిల్​లో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది. తరువాత ఆమె నాసా ఆస్ట్రోనాట్​ కార్ప్​కు దరఖాస్తు చేసుకున్నారు. చావ్లా మొట్టమొదటి అంతరిక్ష మిషన్ STS -87 అంతరిక్ష నౌకలో 1997 నవంబర్ 18న ప్రారంభమైంది. ఆమెతో పాటు ఆరుగురు -వ్యోమగాములు STS -87 నౌకలో ప్రయాణించారు. అంతరిక్షంలో ఏకంగా 376 గంటలు గడిపి భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మైళ్లు తిరిగారు. దీంతో, కల్పనా చావ్లా అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళగానే కాదు, తొలి ఆసియా మహిళగానూ రికార్డుకెక్కారు. 2003 జనవరిలో STS-107 అంతరిక్ష నౌకలో ఆమె రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి 16 రోజలు గడిపి 80 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు.

2003 ఫిబ్రవరి 1న అంతరిక్షం నుంచి భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కల్పనతో పాటు ఆమెతో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక కొలంబియాలో షెడ్యూల్​ ల్యాండింగ్​కు 16 నిమిషాల ముందు అమెరికాలోని టెక్సాస్​ ప్రాంతంలో కుప్ప కూలిపోయింది. దీంతో ఆమె 40 ఏళ్ల వయస్సులోనే దుర్మరణం పాలయ్యారు.

అంతరిక్షం నుంచి తిరిగి వస్తుండగా దుర్మరణం ..
ఆమె గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కారాన్ని 2003 నుంచి ఏటా ప్రకటిస్తోంది. దీన్ని వివిధ రంగాల్లోని 15 మంది శక్తివంతమైన మహిళలకు అందజేస్తుంది. కల్పన గౌరవార్థం దేశంలోని ఎన్నో విద్యాసంస్థలకు, స్కాలర్​షిప్​లకు, అవార్డులకు ఆమె పేరు పెట్టారు. యువ మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం 2004లో కల్పనా చావ్లా అవార్డును ఏర్పాటు చేసింది. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం 2003లో ప్రయోగించిన మెట్​ శాట్​కు కల్పనా చావ్లా పేరు పెట్టారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: