20 లీటర్ల వాటర్‌కే‌న్‌లో ఇరుక్కున్న పిల్లి పిల్ల... ఇప్పుడెలా... వైరల్ వీడియో

ఆ పిల్లి కూన ఇరుక్కున్న విధానం చూస్తే... అసలు అది అలా ఎలా ఇరుక్కుంది అనే డౌట్ మనకు రావడం గ్యారెంటీ. దాన్ని చూసిన వాళ్లంతా... అయ్యో అంటున్నారు. చివరకు ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 7, 2020, 11:24 AM IST
20 లీటర్ల వాటర్‌కే‌న్‌లో ఇరుక్కున్న పిల్లి పిల్ల... ఇప్పుడెలా... వైరల్ వీడియో
20 లీటర్ల వాటర్‌కే‌న్‌లో ఇరుక్కున్న పిల్లి పిల్ల... (credit - Youtube)
  • Share this:
మనలో చాలా మంది మినరల్ వాటర్ తెచ్చుకోవడానికి వాడుకుంటామే... అలాంటి 20 లీటర్ల కేన్‌లో ఓ పిల్లి కూన ఇరుక్కోవడం కలకలం రేపింది. దాని తల... వాటర్ కేన్ బయటకు కనిపిస్తంది. మిగతా బాడీ... వాటర్‌ కేన్‌లో ఉండిపోయింది. ఆ కిట్టీ... లోపలికి వెళ్లలేక... బయటకు రాలేక... మధ్యలో ఇరుక్కుపోయి... మ్యావ్... మ్యావ్ అంటోంది. ఇండొనేసియా... జకార్తాలో ఇలా జరిగింది. అసలు దాని తల మధ్యలో ఎలా ఇరుక్కుంది అన్నది తేలాల్సిన ప్రశ్న. చాలా మంది ఆ వాటర్ కేన్ సంగతి తెలియక... ఆ పిల్లి పిల్ల... లోపలికి ఎంటరై ఉంటుందనీ... తిరిగి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఇరుక్కుపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ విషయంపై వెస్ట్ జకార్తా ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి కాల్ వెళ్లింది. వాళ్లు వెంటనే వచ్చారు. కేన్‌ను తమ ఆఫీసుకి పట్టుకుపోయారు. అప్పటికే ఆ పిల్లి... "అయిపోయాన్రా దేవుడా" అన్నట్లు నీరసంగా కనిపించింది. సరిగా అరవలేకపోతోంది కూడా.

ఫైర్ సిబ్బంది... ప్రత్యేక పరికరాలతో... వాటర్ కేన్ మూతను కట్ చేయడానికి ప్రయత్నించారు. ఇదేమంత తేలిక కాదు. ఎందుకంటే... అలా కట్ చేస్తున్నప్పుడు... పిల్లి తల, మెడకు గాయాలు అవ్వకూడదు. అదే సమయంలో... మూత కట్ అవ్వాలి. అందువల్ల వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకొని... 30 నిమిషాలు కష్టపడి.. సక్సెస్ అయ్యారు.

ఇలా బయటపడిన కూన... ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చినంత ఆనంద పడింది. మ్యావ్ మ్యావ్ అని గట్టిగా అరిచింది. అక్కడున్నవాళ్లకు ఓ విషయం అర్థమైంది. అది ఊర పిల్లి. ఎవరూ పెంచుకుంటున్నది కాదు. దాంతో... కేన్ ఎవరిదో... ఆ ఫ్యామిలీ దాన్ని పెంచుకోవాలని డిసైడయ్యారు. ఫైర్ స్టేషన్‌కి వెళ్లి... పిల్లిని దత్తత తీసుకున్నారు.

ఇలాంటి చిత్రమైన ఘటనల్ని అప్పుడప్పుడూ మనం చూస్తుంటాం. జంతువుల కాదు... పసి పిల్లలు కూడా తమకు తెలియకుండానే ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకుంటారు. యూపీలో ఓ చిన్నారి ఇలాగే... పాము పిల్లను నోట్లో పెట్టుకొని బబుల్‌గమ్ నమిలినట్లు నమిలేశాడు. డాక్టర్లు ఆ చిన్నారిని బతికించారు. ఆమధ్య ఓ బైకు హెడ్ లైట్‌లో పాము దూరి... గంట పాటూ బయటకు రాకుండా ఇబ్బంది పడింది, ఇబ్బంది పెట్టింది. ఇంతకీ ఈ పిల్లి పిల్లకు ఓ పేరు పెట్టారు. అదేంటంటే... మస్తంగ్.
Published by: Krishna Kumar N
First published: September 7, 2020, 11:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading