ఆ దేశంలో.. వయసొచ్చిన ప్రతీ యువకుడు.. ముగ్గురిని పెళ్లి చేసుకోవాల్సిందే.. లేదంటే..?

ఆఫ్రికన్ దేశాల్లో 'పెళ్లి'ని పెద్ద ఘనకార్యంగా భావిస్తారు. ఎక్కువమంది మహిళలను పెళ్లి చేసుకోవడం ద్వారా కుటుంబం ఆర్థికంగా వృద్ది చెందుతుందని నమ్ముతారు.

news18-telugu
Updated: May 14, 2019, 3:08 PM IST
ఆ దేశంలో.. వయసొచ్చిన ప్రతీ యువకుడు.. ముగ్గురిని పెళ్లి చేసుకోవాల్సిందే.. లేదంటే..?
ఆఫ్రికన్ సంతతి ప్రజలు
  • Share this:
స్త్రీ-పురుష సంఖ్యలో అసమానత కారణంగా ప్రపంచవ్యాప్తంగా 'పెళ్లి కాని ప్రసాద్‌'ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో కొన్ని కమ్యూనిటీల్లో పెళ్లి చేసుకుందామంటే ఆడపిల్లలు దొరకని పరిస్థితి. ఇక్కడి పరిస్థితి ఇలా ఉంటే.. స్వాజిలాండ్ లాంటి దేశాల్లో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య దాదాపు మూడు రెట్లు ఎక్కువ. దీంతో అక్కడి అమ్మాయిలకు సరిపడినంత మంది అబ్బాయిలు లేరు. అందుకే ఆ దేశాన్ని కన్యల దేశం అని కూడా పిలుస్తారు. ఈ నేపథ్యంలో స్వాజిలాండ్ కింగ్ మెస్వాతి III ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇక నుంచి స్వాజిలాండ్‌లో మేజర్ అయిన ప్రతీ యువకుడు తప్పనిసరిగా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని రాజు ఆ దేశ ప్రజలను ఆదేశించారు. లేనిపక్షంలో వారికి జైలు శిక్ష తప్పదన్నారు. ఇందుకోసం జూన్, 2019 డెడ్‌లైన్ విధించారు. అంతేకాదు, ఒకవేళ మూడుకి మించి ఐదు పెళ్లిళ్లు చేసుకునేవారికి.. ప్రభుత్వమే ఇళ్లు కూడా కట్టిస్తుందని రాజు మెస్వాతి హామీ ఇచ్చారు.


స్వాజిలాండ్ రాజు మెస్వాతికి ఇప్పటికే 15మంది భార్యలు, 25 మంది సంతానం ఉన్నారు. ఇక ఆయన తండ్రికి 70మందికి పైగా భార్యలు, 150మంది సంతానం ఉన్నారు. ఆఫ్రికన్ దేశాల్లో 'పెళ్లి'ని పెద్ద ఘనకార్యంగా భావిస్తారు. ఎక్కువమంది మహిళలను పెళ్లి చేసుకోవడం ద్వారా కుటుంబం ఆర్థికంగా వృద్ది చెందుతుందని నమ్ముతారు. కానీ నిపుణులు మాత్రం ఇలాంటి చర్యల ద్వారా దేశం మరింత దారిద్ర్యంలోకి నెట్టివేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : టాప్-5.. కనీవినీ ఎరుగని వివాహ సాంప్రదాయాలు..
First published: May 14, 2019, 3:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading