3 నెలల్లో 17 మంది ఖైదీల విడుదల... కిమ్ కర్దాషియన్ చెబితే ట్రంప్ వినాల్సిందేనా...

Kim Kardashian : ఖైదీలలో మార్పు తెచ్చేందుకు కిమ్ కర్దాషియన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు... సత్ప్రవర్తనతో విడుదలవుతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 9:33 AM IST
3 నెలల్లో 17 మంది ఖైదీల విడుదల... కిమ్ కర్దాషియన్ చెబితే ట్రంప్ వినాల్సిందేనా...
కిమ్ కర్దాషియన్, ట్రంప్
  • Share this:
కిమ్ కర్దాషియన్ (Kimkardashian)... రియాలిటీ టీవీ స్టార్, బిజినెస్ వుమన్, సోషలైట్... ఇలా చాలా రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇన్‌స్టాగ్రాంలో 13 కోట్ల 60 లక్షల మంది ఫాలోయర్లున్న ఈ భామ... 90 రోజుల స్వేచ్ఛ పేరుతో ఓ క్యాంపెయిన్ ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్... ఫస్ట్ స్టెప్ చట్టంపై సంతకం చెయ్యడంతో... డ్రగ్స్ కేసులో అరెస్టై జైలుపాలవుతున్న ఖైదీలను తన క్యాంపెయిన్ ద్వారా రిలీజ్ చేయిస్తోంది కిమ్ కర్దాషియన్. ఇందుకోసం అవసరమైన నిధులను కిమ్ సమకూర్చుతోందని ఆమెకు సంబంధించి ఖైదీల తరపున వాదించే లాయర్లు బ్రిట్టనీ బార్నెట్, మి యాంజెల్ కోడీ తెలిపారు. బతికి ఉన్న ఖైదీలను అలాగే పూడ్చి పెట్టే కార్యక్రమాన్ని (Buried Alive Project) వ్యతిరేకిస్తున్న కిమ్... అలాంటి శిక్ష పడిన ఖైదీల ఆవేదనను ప్రపంచానికి తెలియజేస్తోంది.

ఖైదీలకు వేస్తున్న శిక్షల్ని తగ్గించాలనే అంశంపై మాట్లాడేందుకు కిమ్ కర్దాషియన్ గతేడాది వైట్‌హౌస్‌కి వెళ్లింది. అధ్యక్షుడు ట్రంప్‌ని కలిసింది. ఫలితంగా ఫస్ట్ టైమ్ డ్రగ్ కేసులో పట్టుబడి... జీవిత ఖైదు అనుభవిస్తున్న 60 ఏళ్ల మహిళకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. ఇలా ఇప్పటివరకూ 17 మందికి కఠిన శిక్షలు తప్పేలా చేసింది కిమ్.2022 నాటికి లాయర్ అవ్వాలని కలలు కంటున్న కిమ్ కర్దాషియన్... వారానికి 18 గంటలపాటూ బుక్స్ చదువుతోంది. బార్ ఎగ్జామ్ పాసై లాయర్ అవుతానంటోంది. డ్రగ్స్ కేసుల్లో దొరికిపోయి... ఫస్ట్ స్టెప్ చట్టం కింద జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లు అమెరికాలో వందల్లో ఉన్నారు. వాళ్లకు కొత్త జీవితాన్ని ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్న కిమ్‌కి ఆమె తరపు లాయర్ల నుంచీ పూర్తి మద్దతు లభిస్తోంది. 

ఇవి కూడా చదవండి :

యూపీలో బీజేపీకి షాక్ తప్పదా... మారుతున్న పరిస్థితులు... పెరుగుతున్న పార్టీల వ్యతిరేకత...

దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

నేడు పశ్చిమ బెంగాల్‌కి చంద్రబాబు... మమతా బెనర్జీకి మద్దతుగా రెండ్రోజులు ప్రచారం

చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?
First published: May 8, 2019, 9:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading