హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

North Korea new rules: దేశాధినేత సంచలన నిర్ణయం.. ఇకపై ఎవరూ నవ్వకూడదు, ఏడవకూడదు, పుట్టినరోజులు జరుపుకోకూడదు.. 

North Korea new rules: దేశాధినేత సంచలన నిర్ణయం.. ఇకపై ఎవరూ నవ్వకూడదు, ఏడవకూడదు, పుట్టినరోజులు జరుపుకోకూడదు.. 

ఉత్తర కొరియా (North Korea). ప్రపంచంలో ఎక్కువగా వార్తల్లో నిలిచే దేశం. దేశాధ్యక్షుడిగా కిమ్​ జోంగ్​ ఉన్​ (Kim Jong Un) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు. ఈ నియంత మరో హుకూం జారీ చేశాడు.

  ఉత్తర కొరియా (North Korea). ప్రపంచంలో ఎక్కువగా వార్తల్లో నిలిచే దేశం. దేశాధ్యక్షుడిగా కిమ్​ జోంగ్​ ఉన్​ (Kim Jong Un) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు. ఈ నియంత మరో హుకూం జారీ చేశాడు. నవ్వొద్దు, తాగొద్దు, గట్టిగా ఏడ్వొద్దు అంటూ ఆర్డర్స్  (North Korea new rules) జారీ చేశాడు ఈ ఉత్తర కొరియా అధినేత కిమ్‌. ఈ నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) నియంతృత్వ పోకడలు ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఈ ఆంక్షలు ఎందుకోసమో తెలుసా.. తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ (Kim Jong il) మరణించి (died) నేటికి 10 సంవత్సరాలు (10 years) పూర్తి కావస్తుండటంతో ఈ కొత్త నిర్ణయాలు (North Korea new rules) తీసుకున్నాడు.

  11 రోజులు సంతాప దినాలుగా..

  ఆయన సంస్మరణార్థం ఆ దేశంలో 11 రోజులు సంతాప దినాలుగా (Days of mourning) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ వింత ఆంక్షలను (North Korea new rules)  జారీ చేశాడు. ఈ 11 రోజులు వారు నవ్వొద్దు (don't laugh), మద్యం తాగొద్దు (Don't drink), వేడుకలు (No celebrations) చేసుకోవద్దు.. ఈ నియమాల (North Korea new rules)పై అక్కడి మీడియా తాజాగా ప్రకటన జారీ చేసింది.

  మద్యం సేవించకూడదు..

  కిమ్ జోంగ్ ఉన్ తండ్రి 2011 డిసెంబర్​ 17న మరణించాడు. ఆయన మరణించి ఇప్పటికీ పదేళ్లు పూర్తవుతోంది. దీంతో దేశమంతా 11 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు (North Korea new rules) విధిస్తూ మీడియాలో ప్రకటన జారీ చేశారు. ఈ 11 రోజులూ ప్రజలెవ్వరూ మద్యం సేవించకూడదు. నవ్వకూడదు (ban laughing), వేడుకల్లో పాల్గొనకూడదు. మొదటి రోజు డిసెంబర్‌ 17న దేశ ప్రజలెవ్వరూ నిత్యావసరాలు కొనేందుకు దుకాణాలకు వెళ్లరాదు. ఈ సంతాప దినాల సమయంలో ఎవరైనా మరణిస్తే.. మృతుని కుటుంబ సభ్యులు కూడా బిగ్గరగా ఏడవకూడదు. పుట్టిన రోజులు జరుపుకోవడానికి అస్సలు వీలులేదు (No Birthdays).

  గతంలో కూడా కిమ్ (Kim)​ వింతైన, ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే నిబంధనలు విధించాడు. గత నెలలోనే దేశవ్యాప్తంగా లెదర్‌ కోట్లు (Leather coats), జాకెట్లను నిషేధిస్తూ కిమ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్​ ఉన్ (Kim Jong Un) తప్ప ఎవరూ వాటిని ధరించడానికి వీల్లేదని ఆ ఆదేశాల్లో కొరియా పేర్కొంది. గత నెల 21న ప్యాంగ్‌యాంగ్‌ పర్యటన సందర్భంగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వేసుకున్న లెదర్‌ జాకెట్‌ను పోలినవి.. కొందరు యువకులు వేసుకుని కనిపించారు. ఉత్తర కొరియా పౌరులు అలా ప్రవర్తించడం.. దేశ అధ్యక్షుడి ఫ్యాషన్‌ ఛాయిస్‌ (fashion choice)ను అవమానించినట్లే అవుతుందని కొరియా మండిపడింది. అందుకే లెదర్‌జాకెట్ల (leather jackets)ను కొరియాలో నిషేధించింది. నిషేధ ఆదేశాలు ధిక్కరిస్తే ఆరేళ్లు నిర్బంధ కారాగార శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు సైతం జారీ చేసింది.

  First published:

  Tags: Kim jong un, New rules, North Korea

  ఉత్తమ కథలు