• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • KIM JONG UN USING BODY DOUBLE AFTER MAKING PUBLIC APPEARANCE SINCE DEATH RUMOURS REPORTS BA

కింగ్ జాంగ్ ఉన్.. ‘రాముడు-భీముడు’ గేమ్ ఆడుతున్నాడా?

కింగ్ జాంగ్ ఉన్.. ‘రాముడు-భీముడు’ గేమ్ ఆడుతున్నాడా?

అయితే, ఆ దేశం గట్టి చర్యలు తీసుకుని వాటిని కంట్రోల్ చేసింది. ఆ తర్వాత ఏకంగా ఎన్నికలు కూడా నిర్వహించింది.

కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంతో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ బాడీ డబుల్ అంశం తెరమీదకు వచ్చింది.

  • Share this:
    ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రాముడు భీముడు గేమ్ ఆడుతున్నాడా?. రాముడు - భీములు ఒకే రూపంలో ఉంటారు. ఒకరి ప్లేస్‌లోకి మరొకరు వెళ్తారు. అక్కడ అమాయకుడి కుటుంబంలో, వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలకు భీముడు చెక్ పెడతాడు. అయితే, ఇక్కడ కిమ్ జాగ్ ఉన్ మాత్రం తనలా ఉండే మరొకరిని తనకు బదులుగా బయటకు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి డెయిలీ మెయిల్ అనే వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. కిమ్ జాంగ్ ఉన్ తన బాడీ డబుల్‌ను వినియోగించాడనేది ఆ కథనం సారాంశం.

    కిమ్ జాంగ్ ఉన్ ఏప్రిల్ 11న కనిపించాడు. ఆ తర్వాత కనిపించకపోయే సరికి అతడికి ఏదో జరిగిందని, ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, మే 1న ఇటీవల ప్యాంగ్ యాంగ్‌లోని ఓ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి హాజరుకావడంతో ఆ ప్రచారానికి చెక్ పడింది. తాజాగా వస్తున్న రూమర్ల ప్రకారం ఆ రోజు ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చింది కిమ్ జాంగ్ ఉన్ కాదని, అతడి బాడీ డబుల్ అని చెబుతున్నారు. అందుకు కొన్ని ఆధారాలను కూడా చూపిస్తున్నారు. కిమ్ జాంగ్ ఉన్ పళ్లు, దవడలు, ఆ రోజు ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన వ్యక్తి పళ్లు తేడాగా ఉన్నాయని చెబుతున్నారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: