హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

తగ్గేదేలేదంటోన్న Kim jong un.. రైలు నుంచి మిస్సైల్ ప్రయోగం.. అమెరికాపై North Korea ధిక్కారం..

తగ్గేదేలేదంటోన్న Kim jong un.. రైలు నుంచి మిస్సైల్ ప్రయోగం.. అమెరికాపై North Korea ధిక్కారం..

స్వదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడినా, శతృదేశాలకు సవాళ్లు విసరడంలో, అందునా అమెరికాను ధిక్కరించే విషయంలో తగ్గేదేలేదంటున్నాడు నార్త్ కొరియా నియంత నేత కిమ్ జోంగ్ ఉన్. అగ్రరాజ్యానికి అసలే భయపడబోననే సంకేతంగా నార్త్ కొరియా ఈసారి రైలు నుంచే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. వివరాలివి..

ఇంకా చదవండి ...

కరోనా విలయం వల్ల ఆహార ఉత్పత్తి పడిపోయి, దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడినా, శతృదేశాలకు సవాళ్లు విసరడంలో, అందునా అమెరికాను ధిక్కరించే విషయంలో తగ్గేదేలేదంటున్నాడు నార్త్ కొరియా నియంత నేత కిమ్ జోంగ్ ఉన్. కరోనా సమయంలోనూ అణ్వాయుధాలతో ప్రపంచాన్ని బెదరగొడుతున్నాడనే కారణంగా కిమ్ దేశంపై అమెరికా కఠిన ఆంక్షలు విధించగా, అగ్రరాజ్యానికి అసలే భయపడబోననే సంకేతంగా నార్త్ కొరియా ఈసారి రైలు నుంచే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. వివరాలివి..

అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా మరో క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. ఈసారి రైలు నుంచి బాలిస్టిక్ మిస్సైల్ పరీక్షించినట్లు నార్త్ కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికా ఆంక్షలకు భయపడబోమనే సందేశాన్ని ఇచ్చేందుకే నెల రోజుల వ్యవధిలో నార్త్ కొరియా మూడో మిస్సైల్ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది.

shocking Tsunami : అమెరికా సహా పలు దేశాలల్లో సునామీ.. సముద్రం అడుగున భారీ అగ్నిపర్వతం పేలి..

నార్త్ కొరియా ఇటీవలే రెండు క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించగా, తాజాగా రైలు నుంచి మిస్సైల్ టెస్టును విజయవంతంగా చేపట్టినట్లు సౌత్ కొరియా సైతం ధృవీకరించింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు సాయం అందిస్తోన్న ఐదు సంస్థలపై అమెరికా బుధవారం ఆంక్షలు విధించిన క్రమంలో తాజా మిస్సైల్ టెస్ట్ జరగడం గమనార్హం.

Omicron reinfection : ఒమిక్రాన్ మళ్లీ సోకుతుందా? ఒంట్లో అది లేకుంటే అంతే గతి?ఉత్తరకొరియా మిస్సైల్ టెస్టులకు సహకరిస్తోన్న సంస్థలపై ఆంక్షలు విధించిన అమెరికా.. కిమ్ దేశంపై ఆర్థిక, సైనిక పరమైన మరిన్ని ఆంక్షలు విధించేలా ఐక్యరాజ్యసమితిని కోరనున్నట్లూ తెలిపింది. అమెరికా ప్రకటన వెలువడిన రెండు రోజుల వ్యవధిలోనే, అంటే శుక్రవారం నాడు నార్త్ కొరియా రైలు నుంచి క్షిపణి ప్రయోగం జరిపింది.

First published:

Tags: Kim jong un, North Korea, USA

ఉత్తమ కథలు