అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఉత్తర కొరియా.. తాజాగా మరో క్షిపణిని పరీక్షించినట్లు తెలుస్తోంది. దేశ తూర్పు తీరం నుంచి కనీసం ఒక బాలిస్టిక్ మిస్సైల్‌ను ఉత్తర కొరియా పేల్చిందని దక్షిణ కొరియా, జపాన్ తెలిపాయి. భారీ ఆయుధాలు, అణు కార్యకలాపాల ప్రతిష్ఠంభనపై చర్చించేందుకు నిఘా అధిపతులతో చర్చలు, స్పేస్ లాంచ్‌కు దక్షిణ కొరియా సిద్ధమవుతున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఉత్తర కొరియా చేపట్టిన అణ్వాయుధాలు, మిస్సైల్ కార్యకలాపాలపై అంతర్జాతీయంగా నిషేధం విధించిన క్రమంలో ఆ దేశం చేపట్టిన తాజా ఆయుధ పరీక్ష ఇది. సింపో ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:17 గంటలకు ఒక బాలిస్టిస్ మిస్సైల్ ప్రయోగం జరిగిందని దక్షిణ కొరియా ఉమ్మడి బలగాల అధిపతి ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉత్తర కొరియా తన సబ్‌మెరైన్స్, సబ్ మెరైన్స్ ద్వారా లాంచ్ చేసే బాలిస్టిక్ మిస్సైల్స్‌ను పరీక్షించేందుకు అవసరమైన పరికరాలను ఉంచుతుంది. ఇతర రకాల మిస్సైల్స్‌ను కూడా ఉత్తర కొరియా ఈ ప్రాంతం నుంచే పరీక్షిస్తుంది. ఇది ఏ రకపు బాలిస్టిస్ మిస్సైల్, అది ఎంత దూరం ప్రయాణించిందనే వివరాలు దక్షిణ కొరియా వెల్లడించలేదు. కాగా, నార్త్ ప్రయోగించిన క్షిపణి జపాన్ జలాలకు సమీపంగా పడటంతో జపాన్ హెచ్చరికలు జారీ చేసింది.
పరిస్థితిని తమ సైన్యం నిశితంగా పరిశీలిస్తోందని, ఇంకా ఏమైనా ప్రయోగాలు చేపట్టినట్టు అయితే దాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాతో సన్నిహితంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా తెలిపింది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణు చర్చలు గడిచిన రెండు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నప్పుడు దౌత్యసంబంధాలు దెబ్బతినడంతో తమ అణ్వాయుధ వ్యవస్థను బలోపేతం చేసుకుంటామని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు.
మరో వైపు రెండు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను తాము గుర్తించామని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తెలిపారు. గడిచిన కొన్ని వారాలుగా ఉత్తర కొరియా అనేక మిస్సైల్ పరీక్షలు చేపట్టిందని, ఇది క్షమార్హం కాదని తెలిపారు. అటు అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (ADEX) ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు వందల సంఖ్యలో అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు, అంతర్జాతీయ సైన్యం సియోల్‌కు చేరుకున్నారు.
దక్షిణ కొరియా చేపట్టిన అతి పెద్ద రక్షణ ఎక్స్‌పో ఇది. ఇందులో నెక్ట్స్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అటాక్ హెలికాప్టర్లు, డ్రోనలు, ఇతర అత్యాధునిక ఆయుధాలతో పాటు స్పేస్ రాకెట్లు, పౌర ఏరోస్పేస్ డిజైన్లు ఇక్కడ డిస్‌ప్లేలో చూడవచ్చు. సొంతంగా అభివృద్ధిపరిచిన మొట్టమొదటి అంతరిక్ష వాహనాన్ని ఈ గురువారం ప్రయోగించేందుకు దక్షిణ కొరియా సిద్ధమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Japan, Kim jong un, North Korea, South korea