కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. కానీ..?

కిమ్ చుట్టూ ఉండే దుర్భేద్యమైన రక్షణ కవచాన్ని దాటుకొని చిన్న రహస్యం కూడా బయటికి రాలేదు. అలాంటిది.. ఆయన చనిపోయాడని వస్తున్న వార్తలు ఎంత వరకు నిజం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

news18-telugu
Updated: April 30, 2020, 9:42 AM IST
కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. కానీ..?
కిమ్ జోంగ్ ఉన్ (File)
  • Share this:
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం తెలీక ప్రపంచం తలలు పట్టుకుంటోంది. కరోనా వైరస్‌కు భయపడి రహస్య జీవితం గడుపుతున్నారని కొందరు.. హార్ట్ ఎటాక్‌తో చనిపోయారని ఇంకొందరు.. చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, కిమ్ చుట్టూ ఉండే దుర్భేద్యమైన రక్షణ కవచాన్ని దాటుకొని చిన్న రహస్యం కూడా బయటికి రాలేదు. అలాంటిది.. ఆయన చనిపోయాడని వస్తున్న వార్తలు ఎంత వరకు నిజం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. దక్షిణ కొరియా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న థాయె యాంగ్ హో మాత్రం.. కిమ్ బతికే ఉన్నారని కుండబద్దలు కొడుతున్నారు. ఈయన ఉత్తరకొరియాలో దౌత్యవేత్తగా గతంలో పనిచేశారు. కిమ్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, తనంతట తాను నిలబడలేకుండా ఉన్నాడని, నడవలేని స్థితిలో ఉన్నాడని వెల్లడించారు థాయె.

జపాన్, హాంకాంగ్ చెబుతున్నట్లు హార్ట్ సర్జరీ తర్వాత కిమ్ చనిపోలేదని, బ్రెయిన్ డెడ్ కాలేదని.. ఆ సమాచారం అంతా తప్పేనని వ్యాఖ్యానించారు. కాగా, కిమ్‌ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఆయన భార్యకు, లేదా సోదరికి లేదా.. అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే తెలుస్తుందని, థాయె చెప్పిన సమాచారం కరెక్టేనని నమ్మలేమని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఏప్రిల్ 11 తర్వాత కనిపించని కిమ్.. ఏప్రిల్ 15న ఆయన తాత జయంతి వేడుకల్లోనూ పాల్గొనలేదు. దీంతో ఏప్రిల్ 12న చేయించుకున్న సర్జరీ తర్వాత అనారోగ్యంతో కిమ్ చనిపోయినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
First published: April 30, 2020, 9:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading