KIM JONG UN GIFTS LUXURY APARTMENT TO NORTH KOREAS VETERAN NEWS ANCHOR PVN
North Korea News Anchor: టీవీ యాంకర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కిమ్..ఎందుకో తెలుసా
న్యూస్ యాంకర్ కి కిమ్ కాస్ట్ లీ గిఫ్ట్
North Korea News Anchor: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un)..ఆయన ఏది చేసినా సంచలనే. తాజాగా ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్ యాంకర్ రీ చున్ హీకి(79) బుధవారం అదిరిపోయే కానుక ఇచ్చారు కిమ్ జోంగ్ ఉన్. ఆమె కోసం పాంగ్యాంగ్ లో నిర్మించిన అత్యంత విలాసవంతమైన ఇంటిని స్వయంగా కిమ్ ఆమెకు అందజేశారు.
North Korea News Anchor: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un)..ఆయన ఏది చేసినా సంచలనే. తాజాగా ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్ యాంకర్ రీ చున్ హీకి(79) బుధవారం అదిరిపోయే కానుక ఇచ్చారు కిమ్ జోంగ్ ఉన్. ఆమె కోసం పాంగ్యాంగ్ లో నిర్మించిన అత్యంత విలాసవంతమైన ఇంటిని స్వయంగా కిమ్ ఆమెకు అందజేశారు. స్వయంగా ఆ ఇంటికి వెళ్లి రీ చున్(Ri Chun Hi)తో కలియతిరిగారు కిమ్. ఆమె మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేసినట్లు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. 50ఏళ్లకుపైగా దేశం కోసం, అధికారిక పార్టీ కోసం ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ఇంటిని ఇచ్చినట్లు కిమ్ స్పష్టం చేశారు. విప్లవాత్మక అధికార ప్రతినిధిగా బాల్యం నుంచి 50ఏళ్లకుపైగా సేవలు అందించిన రీ చున్కు పార్టీ రుణపడి ఉంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటూ పార్టీ కోసం ఇదే ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నా" అని కిమ్ అన్నట్లు కేసీఎన్ఏ టీవీ ఛానల్ గురువారం తెలిపింది.
ఈ ఇల్లు ఓ అద్భుతమైన హోటల్లా ఉంది. అధికార పార్టీ ధర్మగుణానికి ముగ్ధులై, కృతజ్ఞతగా మా కుటుంబసభ్యులు అందరూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు అని రీ చున్ హీ చెప్పారని కేసీఎన్ఏ వెల్లడించింది. రీ చున్తో పాటు పార్టీ కోసం పని చేస్తున్న మరికొందరికి కిమ్ బుధవారం విలాసవంతమైన ఇళ్లను కానుకగా అందజేశారు.
The truth that will not be shown by your western media.President Kim Jong Un cut the inauguration ribbon for the 10,000 newly constructed residences. These apartments will be distributed to Pyongyang's common working class. pic.twitter.com/dXU978SPD5
— The International Magazine (@TheIntlMagz) April 14, 2022
ఉత్తర కొరియా(North Korea)అధికారిక పార్టీ కోసం యాంకర్ రీ చున్ హీ గత 50 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ఉత్తర కొరియా ఇంకా కిమ్ ఇల్ సంగ్ పాలనలో ఉండగానే ఆ దేశ అధికార టీవీ ఛానల్ లో రీ చున్ హీకి చేరారు. కొరియా సంప్రదాయ వస్త్రధారణలో ఉండే రీ చున్.. దేశ అవసరాలకు తగ్గినట్టుగా తన స్వరాన్ని మార్చుకుంటూ యాంకరింగ్ చేస్తున్నారు. ఉత్తర కొరియాకు సంబంధించిన కీలక వార్తలన్నింటినీ ప్రజలకు తెలియచేసే రీ చున్ హీ.. విదేశీయులకూ సైతం సుపరిచితమే. కేసీఎన్ఏ టీవీ ఛానల్లో వార్తలు చదువుతూ ఆమె పింక్ లేడీగా పాశ్చాత్య దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల్లో దేశభక్తిని ఉప్పొంగించేందుకు భావోద్వేగభరితంగా, ఒకప్పటి దేశాధినేత మరణం మొదలు ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ జరిపే అణు పరీక్షలు వరకు ఉత్తర కొరియాకు సంబంధించిన అన్ని కీలక వార్తలను రీ చున్ హీకి సందర్భాన్ని బట్టి స్వరాన్ని మారుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఆమెకు సేవలను గుర్తించిన కిమ్.. ఇలా బహుమానం అందించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.