కొరియా టూ రష్యా.. మళ్లీ రైల్లోనే వెళ్లిన కిమ్

కొరియా టూ రష్యా.. మళ్లీ రైల్లోనే వెళ్లిన కిమ్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ (File)

కొరియా ద్వీపకల్ప న్యూక్లియర్ సమస్యపై పుతిన్, కిమ్ మధ్య భేటీ జరుగుతుందని రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 • Share this:
  ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏది చేసినా సంచలనమే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తొలిసారిగా సమావేశం అయ్యేందుకు ఆయన రైలులో రష్యాకు వచ్చారు. రెండు దేశాల సరిహద్దులకు దగ్గరగా ఉన్న వ్లాడివోత్సోక్‌లో ఇరువురు భేటీ కానున్నట్లు సమాచారం. కొరియా ద్వీపకల్ప న్యూక్లియర్ సమస్యపై గురువారం ఈ భేటీ జరుగుతుందని రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, కిమ్ ఎక్కడికి వెళ్లినా తన ప్రైవేటు రైల్లోనే ప్రయాణం చేస్తారు.

  ఫిబ్రవరిలో వియత్నాం రాజధాని హనోయిలో కిమ్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో కిమ్, పుతిన్ భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు