ఖషోగీ హత్య ‘నా హయంలోనే’ జరిగిందన్న సౌదీ రాజు

ఇస్తాంబుల్‌లోని సౌదీ క్యాన్సులేట్ వద్ద గత సంవత్సరం అక్టోబర్ 2న జమాల్ ఖషోగీ హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక సౌదీ రాజు హస్తం ఉందని పాశ్చాత్యదేశాలు, సీఐఏ ఆరోపించాయి.

news18-telugu
Updated: September 26, 2019, 8:10 PM IST
ఖషోగీ హత్య ‘నా హయంలోనే’ జరిగిందన్న సౌదీ రాజు
సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్(Image: Reuters)
news18-telugu
Updated: September 26, 2019, 8:10 PM IST
ప్రముఖ జర్నలిస్ట్ ఖషోగీ హత్యకు సంబంధించి సౌదీ రాజు నోరు విప్పారు. జమాల్ ఖషోగీ తన పాలనలోనే జరిగింది కాబట్టి, ఆ హత్యకు తానే బాధ్యత వహించాలని సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినట్టు పీబీఎస్‌ డాక్యుమెంటరీ పేర్కొంది. ఈ డాక్యుమెంటరీ అక్టోబర్ 1న ప్రసారం కానుంది. ఇస్తాంబుల్‌లోని సౌదీ క్యాన్సులేట్ వద్ద గత సంవత్సరం అక్టోబర్ 2న జమాల్ ఖషోగీ హత్యకు గురయ్యారు. దీంతో ఈ హత్య వెనుక సౌదీ రాజు హస్తం ఉందని పాశ్చాత్యదేశాలు, సీఐఏ ఆరోపించాయి. అయితే, సౌదీ రాజు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి పాశ్చాత్యదేశాలు ప్రయత్నించాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖషోగీ హత్యకు సంబంధించిన ప్రశ్నలకు మొదట సౌదీ రాజు తిరస్కరించినా, చివరకు నోరు విప్పినట్టు ఆ ఇంటర్వ్యూ చేసిన పీబీఎస్ రిపోర్టర్ మార్టిన్ స్మిత్ తెలిపారు. ‘అది నా పాలనలోనే జరిగింది. నేనే పూర్తి బాధ్యత తీసుకుంటున్నా. ఎందుకంటే అది నా పాలనలోనే జరిగింది కాబట్టి.’ అని సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినట్టు పీబీఎస్ పేర్కొంది.

First published: September 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...