లక్కీ లేడీ - లవ్లీ లాటరీ.. భర్తకు తెలీకుండా టికెట్ కొంటే బంపర్ ఆఫర్

‘మీరు జాక్ పాట్ కొట్టారు. రూ.21 కోట్ల లాటరీ గెలుచుకున్నారు.’ అని చెప్పగానే తను షాక్‌కి గురైనట్టు సప్న నాయర్ చెప్పారు.

news18-telugu
Updated: July 5, 2019, 2:39 PM IST
లక్కీ లేడీ - లవ్లీ లాటరీ.. భర్తకు తెలీకుండా టికెట్ కొంటే బంపర్ ఆఫర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న ఓ భారతీయ మహిళ జాక్ పాట్ కొట్టింది. ఆమెకు రూ.21 కోట్ల లాటరీ దక్కింది. ఆమె కొనుగోలు చేసిన టికెట్‌కు జాక్ పాట్ తగిలినట్టు నిర్వాహకులు తెలిపారు. అందులో కొంత డబ్బును పేదలు, ముఖ్యంగా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న మహిళల కోసం వినియోగించాలని ఆమె కోరుకుంటున్నట్టు లాటరీ సంస్థ తెలిపింది. కేరళలోకి కొల్లంకు చెందిన సప్న నాయర్ అనే మహిళకు ఈ లాటరీ దక్కినట్టు తెలిపింది. నాయర్ అబుదాబిలోని ఓ కన్సల్టెన్సీలో సీనియర్ స్ట్రక్చరల్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. లాటరీ సంస్థ నిర్వాహకులు ఫోన్ చేసి. ‘మీరు జాక్ పాట్ కొట్టారు. రూ.21 కోట్ల లాటరీ గెలుచుకున్నారు.’ అని చెప్పగానే తను షాక్‌కి గురైనట్టు చెప్పారు. లాటరీ ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తన కుటుంబం కోసం వినియోగించుకుంటానని తెలిపింది. తాను రూ.21 కోట్ల లాటరీ గెలిచానన్న విషయం తెలిసిన తర్వాత 24 గంటలు గడిచినా కూడా ఇంకా నమ్మలేకుండానే ఉన్నానంటూ ఉబ్బితబ్బిబ్బవుతోంది.

తాను రెగ్యులర్‌గా లాటరీ టికెట్లు కొనే వ్యక్తిని కాదని, ఇది మూడో సారో, నాలుగో సారో కూడా సరిగా గుర్తు లేదని చెప్పింది. అయితే, భర్తకు తెలియకుండా ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేసినట్టు చెప్పింది. అయితే, లాటరీ గెలిచానని తెలిసిన తర్వాత మా ఆయన కూడా షాక్‌కు గురయ్యారు అని తెలిపింది. అయితే, ఈ క్రెడిట్ అంతా తన ఐదేళ్ల కుమార్తెకే దక్కుతుందని చెప్పింది. తన కుమార్తె అదృష్టవంతురాలు కాబట్టి లాటరీ తగిలిందని అభిప్రాయపడింది.

First published: July 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>