అసెంబ్లీలో ఆ గ్యాస్ వదిలాడు... వాసన తట్టుకోలేక సభ రద్దు చేసిన స్పీకర్...

Kenya's Homa Bay : సినిమాల్లో చూపించినట్లు గ్యాస్ వదలగానే... సభలో తీవ్ర కలకలం రేగింది. సభ్యులంతా సభ నుంచీ బయటకు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 10, 2019, 7:31 AM IST
అసెంబ్లీలో ఆ గ్యాస్ వదిలాడు... వాసన తట్టుకోలేక సభ రద్దు చేసిన స్పీకర్...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: August 10, 2019, 7:31 AM IST
మన దేశంలో అసెంబ్లీల లాగే... కెన్యాలో అసెంబ్లీ కూడా హాటు హాటుగా ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరో గానీ గ్యాస్ వదిలారు. అది అలా అలా చుట్టుపక్కల అంతా వ్యాపించింది. ఆ వాసన తట్టుకోలేకపోయారు. "బాబోయ్ కంపు భరించలేకపోతున్నాం... ఎవడ్రా నాయనా... ఏం తిన్నాడ్రా వాడు" అంటూ ఎమ్మెల్యేలంతా సభ నుంచీ బయటకు పరుగులు తీశారు. "అధ్యక్షా... మాలో ఒకరు... ఈ గాలిని కాలుష్యం చేశారు... అదెవరో నాకు తెలుసు" అని జూలియస్ గయా అనే ఎమ్మెల్యే విషయాన్ని స్పీకర్‌కి తెలిపారు. ఈ ఆరోపణను మరో సభ్యుడు ఖండించారు. "అధ్యక్షా ఆ ఒకరు నేను కాదు. అలాంటి పనిని నా సహచరుల ముందు నేను చెయ్యను" అని తెలిపారు.

"విషయం అర్థం చేసుకున్న స్పీకర్ ఎడ్విన్ కకాచ్... కాసేపు అందరం బయటకు వెళ్దాం... ఈ లోపు గాలి క్లీన్ అవుతుంది" అని సభకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అంతేకాదు... "వెంటనే వెళ్లి ఎయిర్ ఫ్రెష్‌నర్స్ తీసుకురండి... వెనీలా తెస్తారో, స్ట్రాబెర్రీ తెస్తారో... మీకు నచ్చిన ఫ్లేవర్ తెండి... ఇలాంటి అసెంబ్లీలో మేం కూర్చోలేం" అని అసెంబ్లీ సిబ్బందిని ఆదేశించారు.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...