Schools Close: విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చేలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని హెన్రిటా పేర్కొన్నారు. పాఠశాలకు వస్తేనే విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టగలరని.. చదువుల్లో వెనుకబడిన విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ (Omicron Variant) వణికిస్తోంది. భారత్ (India) సహా చాలా దేశాల్లో లక్షల్లో కొత్త కేసులు వస్తున్నాయి. పాటిజిటివిటీ రేటు కూగా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. ఒమిక్రాన్ సోకే ప్రమాదం ఉన్నందున విద్యార్థులను ఇళ్లకే పరిమితం చేసి.. ఆన్ క్లాసుల ద్వారా విద్యా భోదన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో స్కూళ్ల మూసివేతపై యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (UNICEF) స్పందించింది. స్కూళ్లను మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 81.8 కోట్లు పైగా విద్యార్థులపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. స్కూళ్లల్లో క్లాసులు నిర్వహించకపోవడం వల్ల వారి విద్యా జీవితం సర్వ నాశనం అవుతోందని వాపోయింది. ఈ నేపథ్యంలో కరోనానిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పాఠశాలలను తెరిచే ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రపంచ దేశాలకు యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిటా ఫోర్ సూచిచారు.
డిజిటల్ కనెక్టివిటీపై పెట్టుబడులు పెడితే విద్యార్థులందరికీ ఆన్ లైన్ చదువులు (Online classes) అందుతాయని తెలుసని..కానీ ప్రతి విద్యార్థి పాఠశాలకు తిరిగి వచ్చేలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని హెన్రిటా పేర్కొన్నారు. పాఠశాలకు వస్తేనే విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టగలరని.. చదువుల్లో వెనుకబడిన విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. వీటితో పాటు మధ్యాహ్న భోజనం వంటి పథకాలతో విద్యార్థులకు పోషకాలు అందేలా చేయచయ్చు. విద్యార్ధుల మౌలిక అవసరాలను తీర్చేందుకు కూడా వీలుంటుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా బోధన, బోధనేతర సిబ్బందికి ప్రాధాన్యమిచ్చి.. వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని హెన్రిటా సూచించారు.
విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే, వాటి పంపిణీలో యునిసెఫ్ మద్దతుగా ఉంటుందని హెన్రిటా అభిప్రాయపడ్డారు. ఐతే పెద్దలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులకు వ్యాక్సినేషన్ అవసరం ఉండకపోవచ్చని తెలిపారు. ఒకవేళ విద్యార్థులకి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తే.. వ్యాక్సిన్ వేసుకొని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేరు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేనిదే వారిని స్కూళ్లకు రానీయరు. తద్వారా విద్యార్థుల చదువులో అసమానతలు ఏర్పడతాయని హెర్నిటా ఫోర్ పేర్కొన్నారు. అందుకే డబ్ల్యూహెచ్‌వో సిఫార్సులకు అనుగుణంగా కరోనా కట్టడికి చర్యలు చేపట్టి.. స్కూళ్లను తెరిచి ఉంచాలని యూనిసెఫ్ సూచిస్తోంది. కరోనా వల్ల ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వాల్లను స్కూళ్లకు పంపేందుకు కృషి చేయాలని ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.
కాగా, తెలంగాణతో పాటు మనదేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఒమిక్రాన్ కేసులు భయంకరంగా పెరగడంతో ముందుజాగ్రత్తగా స్కూళ్లకు సెలువులు ప్రకటించారు. ఆన్లైన్లో మాత్రం క్లాసులు కొనసాగుతున్నాయి. ఏపీలో మాత్రం ఇప్పటికీ స్కూళ్లు నడుస్తున్నాయి. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా స్కూళ్లను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. స్కూళ్లను మూసివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే.. స్కూళ్లలో విద్యార్థులకు పాఠాలు చెప్పాలని సూచిస్తోంది. ఇక తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగించాలా? వద్దా? అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.