Home /News /international /

KAZAKHSTAN UNREST DECLARES EMERGENCY TILL JANUARY 19 AFTER MASS UNREST LEAVES DOZENS DEAD HUNDREDS DETAINED SK

Kazaksthan: ఎల్పీజీ ధరల పెంపుతో చెలరేగిన హింస.. పదుల సంఖ్యలో ఆందోళనకారులు, పోలీసులు మృతి

అల్మటీలో అల్లర్లు

అల్మటీలో అల్లర్లు

Kazaksthan Riots: అల్మటీలో హింసాత్మక ఘటనల్లో పదుల సంఖ్యలో ఆందోళనకారులు, పోలీసులు చనిపోవడంతో పాటు వెయ్యి మంది పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో కజక్‌స్థాన్ అధ్యక్షుడు టోకయేవ్‌ రష్యా సాయాన్ని కోరారు.

ఇంకా చదవండి ...
    మధ్య ఆసియా దేశమైన కజక్‌స్థాన్‌లో హింస (Kazaksthan unrest) చెలరేగింది. వాహనాల్లో వాడే ఎల్‌పీజీ గ్యాస్‌ (LPG Price Hike) ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య గొడవలు జరగడంతో హింస చెలరేగింది. దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా దాడులు చేశారు. వారిని అణచివేసేందుకు పోలీస్ బలగాలు కాల్పులు జరిపాయి. పోలీసుల కాల్పులతో పరిస్థితులు మరింత దిగజారాయి. వారిపై ఆందోళనకారులు ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాల ఘర్షణల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో నిరసనకారులు మరణించారు. 12 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అసలు మొత్తం ఎంత మంది మరణించాన్న దానిపై స్పష్టత లేదు.

    టీనేజర్‌ని కాపాడేందుకు సముద్ర అలలకు ఎదురు నిలబడ్డారు..ఎక్కడో తెలుసా..!

    అల్మటీ (Almaty violence)లో భాయనక వాతావరణం నెలకొంది. ఒక పోలీసు అధికారి తల తెగి రోడ్డుపై పడి ఉండడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. ఎల్పీజీ ధరలను రెట్టింపు చేయడాన్ని నిరసిస్తూ కజక్‌స్థాన్‌లో కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. కానీ బుధవారం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాత్రికి రాత్రి ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అధ్యక్ష భవనం, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడించడాని ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఘర్షణలు చోటుచేసుకొని.. హింసాత్మక ఘటనలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు. భారీగా ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. కొంత మంది నిరసన కారులు పోలీసులపై దాడులు చేసి ఆయుధాలను ఎత్తుకెళ్లారని తెలిపారు.

    Farting Star: పిత్తులను అమ్ముతూ కోట్ల సంపాదన.. కానీ చివరకు ఆ గ్యాసే కొంప ముంచింది..

    భారత్‌లో వాహనాల కోసం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ వినియోగిస్తారు. కానీ కజక్‌స్థాన్‌లో ఎక్కువగా ఎల్‌పీజీ గ్యాస్ వాడుతారు. ఐతే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఇంధన ధరలను అక్కడి ప్రభుత్వం భారీగా పెంచింది. సబ్సిడీ పూర్తిగా ఎత్తేయడంతో ఎల్పీజీ ధరలు రెట్టింపయ్యాయి. ఒక్కసారిగా అంతరేటు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్పీజీ ధరలను నిరసిస్తూ గత ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రోజుకు రోజుకూ పరిస్థితి దిగజారుతోంది. అల్మటీలో హింస తర్వాత ప్రభుత్వం అప్రమత్తమయింది. జనవరి 19 వరకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

    Pakistan: థర్డ్‌వేవ్ థ్రెట్..థర్టీ ఇయర్స్ దాటితే బూస్టర్‌ డోస్ మస్ట్

    అల్మటీలో హింసాత్మక ఘటనల్లో పదుల సంఖ్యలో ఆందోళనకారులు, పోలీసులు చనిపోవడంతో పాటు వెయ్యి మంది పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో కజక్‌స్థాన్ అధ్యక్షుడు టోకయేవ్‌ రష్యా సాయాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు రష్యా, దాని మిత్ర దేశాలు బెలారస్, తజికిస్తాన్, కిరిగిస్తాన్, ఆర్మేనియా కూడా కజక్‌స్థాన్‌కు బలగాలను పంపిస్తున్నాయి. కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజషన్‌లో కజక్‌స్థాన్ సభ్య దేశంగా ఉంది. ఈ క్రమంలో సభ్య దేశాలన్నీ కజక్‌స్థాన్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అక్కడ శాంతిని నెలకొల్పేందుకు రష్యా పారా సైనికులను పంపిస్తున్నట్లు సిఎస్‌టిఓ ఇప్పటికే వెల్లడించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Kazaksthan, LPG

    తదుపరి వార్తలు