నేటి నుంచి కార్తీకమాసం (Karthika Masam) ప్రారంభమైంది. ఈ మాసం శివుడి (Lord Shiv)కి ఎంతో ప్రీతిపాత్రమైనదని హిందువుల విశ్వసిస్తారు. నేటి నుంచి శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి.. పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. అందుకే శివభక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఐతే మన దేశంలోనే కాదు.. చాలా దేశాల్లో కూడా శివాలయాలు ఉన్నాయి. ఈ భూమిపై ఎన్నో ప్రాంతాల్లో పరమ శివుడు పూజలందుకుంటున్నాడు. ఐర్లాండ్(Ireland)లో ఓ పురాతన ఓ శివలింగం ఉంది. మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన పొడువాటి శివలింగం వెనక ఎన్నో రహస్యాలు దాగున్నాయి. చుట్టూ రాతి ఇటుకలతో పొడవైన శిలగా ఉంటుంది.
భక్తులను హింసించే వారి భరతం పట్టే అమ్మవారు.. దీపావళి రోజుల్లో మాత్రమే తెరిచే ఆలయం ఇది..
వందల ఏళ్ల కింద దీన్ని గుర్తించారు. స్థానికులు ' లియా ఫెల్ (Lia Fail)' అని పిలుస్తారు. అంటే అదృష్ట శిల అని అర్థం. ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అలానే ఉంది.
లియా ఫెల్ చరిత్ర:
క్రీ.శ. 1632-1636 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన పురాతన గ్రంథం ''ది మైనర్స్ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్''లో శివలింగానికి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. 'తుథాడి దేనన్' వర్గానికి చెందిన ఓ నేత దీన్ని స్థాపించినట్లు అందులో పేర్కొన్నారు. తుథాడి దేనన్ అంటే 'దను' దేవత పిల్లలు అని అర్థం. వీళ్లు క్రీ.పూ. 1897 నుంచి 1700 వరకు ఐర్లాండ్‌ని పాలించారు. క్రైస్తవ సన్యాసులు ఈ శివలింగాన్ని పునరుత్పతి సామర్థ్యానికి చిహ్నంగా భావించేవారు. అంతేకాదు ఎంతో మంది ఐరిష్ రాజుల పట్టాభిషేకాలు సైతం ఇక్కడే జరిగినట్లు చరిత్ర చెబుతోంది.
Chanakya Niti : ఈ 5 విషయాలను గోప్యంగా ఉంచండి, లేదంటే మీ పరువు పోతుంది
దను దేవత:
యూరోపియన్ సంప్రదాయాల్లో దనను నదీ దేవతగా కొలుస్తారు. ఆమె పేరు మీదుగానే దేన్యూబ్, దోన్, డనీపర్, డినియెస్టర్ నదులకు పేర్లు పెట్టారు. ఇక మన వేద సంస్కృతిలోనూ దును దేవత ప్రస్తావన ఉంది. ఆమె దక్ష ప్రజాపతి కూతురు. కశ్యప ముని భార్య. నదీ దేవతగా కొలిచేవారు. దను సోదరి సతీ దేవి. శివుడిని పెళ్లి చేసుకుంది. తదుపరి జన్మలో సతీదేవి పార్వతిగా అవతారమెత్తి శివుడిని వివాహం చేసుకుంది. వేద సంస్కృతిని విశ్వసించే వాళ్లు ఐర్లాండ్‌లోని లియా ఫైల్‌ని శివలింగంగా భావిస్తారు.
ఐర్లాండ్‌లో ఉన్న ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. 2012లో ఓ వ్యక్తి ఏకంగా 11 సార్లు దాడి చేశాడు. 2014లో కొందరు వ్యక్తులు శివలింగంపై పెయింట్ పోశారు. అంతేకాదు ఎన్నోసార్లు క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఐర్లాండ్‌తో పాటు అతి పురాతన నగరాలైన పాల్మైరా (సిరియా), నిమ్రుద్ (ఇరాక్)లోనూ శివుడిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి.
ఇతర దేశాల్లోని శివలింగాలు:
స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో స్వర్ణ శివాలయం ఉంది. తుర్కిస్థాన్ సిటిలో 1200 అడుగులు, హైడ్రోపొలిస్ నగరంలో 300 అడుగుల శివలింగాలు ఉన్నాయి. కంబోడియాలో ఉన్న ఓ పురాతన శివలింగం చాలా ఫేమస్. ఇవి కాకుండా.. బ్రెజిల్, మెక్సికో, జావా, సుమత్రా దీవులు, నేపాల్,పాకిస్తాన్, ఈజిప్ట్ దేశాల్లోనూ పలు చోట్ల శివలింగాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kartika masam, Lord Shiva