హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Karachi Civil War: పాకిస్థాన్.. కరాచీలో సివిల్ వార్ దుమారం.. దర్యాప్తుకి ఆదేశించిన ఆర్మీ చీఫ్

Karachi Civil War: పాకిస్థాన్.. కరాచీలో సివిల్ వార్ దుమారం.. దర్యాప్తుకి ఆదేశించిన ఆర్మీ చీఫ్

కరాచీలో సివిల్ వార్ దుమారం. దర్యాప్తుకి ఆదేశించిన ఆర్మీ చీఫ్ (File)

కరాచీలో సివిల్ వార్ దుమారం. దర్యాప్తుకి ఆదేశించిన ఆర్మీ చీఫ్ (File)

Karachi Civil War: సడెన్‌గా పాకిస్థాన్ కరాచీలో ఏం జరుగుతోంది. ప్రభుత్వ పాలనను తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ఆర్మీ యత్నిస్తోందా? రేగుతున్న తీవ్ర దుమారానికి కారణమేంటి?

Karachi Civil War: దేశ బహిష్కరణలో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడి అరెస్టుకి ఆదేశాలు ఇవ్వాలంటూ.... సింద్ ప్రాంత పోలీస్ చీఫ్‌ని పాకిస్థాన్ ఆర్మీ కిడ్నాప్ చేసినట్లుగా దుమారం రేగుతోంది. దీనిపై దర్యాప్తునకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఓ స్టేట్ మెంట్ వచ్చింది. "పోర్ట్ సిటీ కరాచీలో ఏం జరిగింతో దర్యాప్తు ప్రారంభించండి అని ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆదేశించారు" అని స్టేట్ మెంట్ లో ఉంది. ఇంటర్నేషనల్ హెరాల్డ్... ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అనధికారిక సమాచారం ప్రకారం.. కరాచీలో సివిల్ వార్ జరిగింది. సింద్ పోలీసులు, పాకిస్థాన్ ఆర్మీ... ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘర్షణలో పది మంది కరాచీ పోలీసులు చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ... పాకిస్థాన్‌లోని ప్రముఖ వార్తా పత్రికలు, డాన్ పత్రి దీనిపై ఎలాంటి కథనాలూ ఇవ్వలేదు.

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు జరిపిన ర్యాలీలో పాల్గొన్న నవాజ్ షరీఫ్ అల్లుడు మహ్మద్ సఫ్దార్ అరెస్టయ్యారు. ఐతే... సఫ్దార్‌కు కోర్టు బెయిల్ ఇచ్చింది. దాంతో ఆయన విడుదలయ్యారు. ఐతే... పార్లమెంటరీ రేంజర్లు (పాక్ సైనికులు) సింద్ ప్రాంత పోలీస్ చీఫ్ ముస్తాక్ మెహర్ ను కిడ్నాప్ చేసి... మహ్మద్ సఫ్దార్ ని అరెస్టు చెయ్యమని ఆర్డర్ ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశారనీ... ఆ తర్వాతే ఈ అరెస్టు జరిగిందనే వాదన ఉంది. దీనిపై పార్లమెంటరీ రేంజర్లు, పోలీసులు ఎవరూ కామెంట్ చేయట్లేదు. ఐతే... ముస్తాక్ మెహర్ పట్ల సైనికులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ... కొంత మంది పోలీసు ఉన్నతాధికారులు లీవ్ కోసం అప్లై చేసినట్లుగా తెలిసింది. నిజానికి... సప్ధార్ ను అరెస్టు చేసే ఉద్దేశం పోలీసులకు లేనట్లు తెలిసింది.

జరిగిన ఘటనపై ముస్తాక్ మెహర్ కూడా ఏమీ చెప్పట్లేదు. మిగతా ఆఫీసర్ల లాగే... ఆయన కూడా లీవ్ తీసుకునే ఆలోచనకు వచ్చి... ఆ తర్వాత... మనసు మార్చుకొని... మిగతా ఆఫీసర్లను కూడా లీవ్ తీసుకోవద్దని చెప్పినట్లు తెలిసింది. ఆర్మీ చీఫ్ దర్యాప్తుకి ఆదేశించారు కాబట్టి ఓ 10 రోజులు టైమ్ ఇద్దామని ఆయన చెప్పినట్లు తెలిసింది. తనను ఎవరు కిడ్నాప్ చేశారో, ఎవరు తనను రేంజర్ల దగ్గరకు తీసుకెళ్లారో ఆయన చెప్పలేదు.

సింద్ ప్రాంత పోలీసులు రకరకాల ట్వీట్లు పెడుతున్నారు. ఇదో దురదృష్టకర ఘటన అని వారు వాటిలో రాస్తున్నారు. ఈ ఘటన పోలీసుల్లోని అన్ని స్థాయిల వారికీ తలనొప్పిగా మారిందని రాస్తున్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.

పాకిస్తాన్ పాలనలో మిలిటరీ జోక్యం మొదటి నుంచి ఉన్నదే. పాలకులు ఆర్మీ చేతిలో కీలుబొమ్మలు అవుతున్న ఘటనలు పాకిస్థాన్ లో ఎప్పుడూ చూసేవే. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కూడా మెతకవైఖరితోనే ఉన్నారు తప్ప... సైన్యాన్ని తన కంట్రోల్ లో పెట్టుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. నవాజ్ షరీఫ్ కీ మిలిటరీకి మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. షరీఫ్... పాకిస్థాన్ కి మూడుసార్లు ప్రధానిగా చేశారు. 2017లో అవినీతి ఆరోపణలతో పదవి నుంచి దిగిపోయారు. ఆ సంవత్సరం నవంబర్ నుంచి ఆయన దేశ బహిష్కరణలో భాగంగా... లండన్ లో ఉంటున్నారు.

కరాచీలో పేలుడు:

ఓవైపు ఈ సివిల్ వార్ దుమార్ కొనసాగుతుంటే... తాజాగా... కరాచీలోని.. గుల్షన్ ఐ ఇక్బాల్ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 15 మంది గాయపడ్డారు. వారిని స్థానిక పటేల్ ఆస్పత్రికి తరలించారు. ఓ సిలిండర్ పేలడం వల్ల ఈ పేలుడు సంభవించిందనే అనుమానం ఉంది. కానీ... కచ్చితంగా పేలుడుకు కారణం ఏంటన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. బాంబ్ డిస్పోజల్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ఓ భవనంలోని రెండో అంతస్థులో ఈ పేలుడు జరిగింది. ఫలితంగా ఆ భవనంతోపాటూ చుట్టుపక్కల భవనాలు, అక్కడి వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. నిన్న కూడా అక్కడి షీరిన్ జిన్నా కాలనీలో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు గాయపడ్డారు. అక్కడే IED తో పేలుడు జరిపినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

First published:

Tags: Pakistan army

ఉత్తమ కథలు