Afghanistan: తాలిబన్ల అరాచకం.. కాందహార్ ఎయిర్‌పోర్టుపై రాకెట్ల దాడి.. రన్ వే ధ్వంసం

కాందహార్ ఎయిర్‌పోర్టుపై దాడి

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటి వరకు 193 జిల్లా కేంద్రాలు, 10 సరిహద్దు జిల్లాలు తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. తాఖర్, కుందుజ్, బడఖ్‌షాన్, హెరాత్, ఫరాహ్ ప్రావిన్స్‌ల్లోని 10 బోర్డర్ క్రాసింగ్ పాయింట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 14 తర్వాత దాదాపు ANDSF సిబ్బంది తాలిబన్ల దాడుల్లలో మరణించారు.

 • Share this:
  ఆఫ్ఘనిస్తాన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు అక్కడ విధ్వంసానికి పాల్పడుతున్నారు. తాలిబన్ల అరాచకాలు పెరగడంతో ప్రజలంతా ప్రాణాలరచేత పట్టుకొని భయం భయంగా బతుకుతున్నారు. తాజాగా కాందహార్‌లో తాలిబన్లు మరోసారి పేట్రేగిపోయారు.
  కాందహార్ విమానాశ్రయంపై రాకెట్లతో విరుచుకుపడ్డారు. మూడు రాకెట్లతో దాడి చేయగా.. రెండు రాకెట్లు ఎయిర్ పోర్టు రన్ వేను తాకాయి. ఆ దాడిలో రన్ వే తీవ్రంగా దెబ్బ తిన్నదని ఎయిర్ పోర్ట్ చీఫ్ మసూద్ పస్తూన్ వెల్లడించారు. ఈ ఘటన అనంతరం కాందహార్ ఎయిర్‌పోర్టుకు విమాన రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ రన్ వే మరమ్మతులు, ఇతర ఆపరేషన్స్ జరుగుతున్నాయని తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ త్వరలో జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఐతే రాకెట్ల దాడిలలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.


  ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై పట్టు బిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రావిన్స్‌ల్లో కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పశ్చిమాన హెరాత్ ప్రావిన్స్, దక్షిణాన లష్కర్ ప్రావిన్స్ దాదాపు వీరి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే కాందహార్ శివారు ప్రాంతాలపై పట్టు బిగిస్తున్నారు. కాందహార్‌ను కూడా వశపరచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాందహార్ తమ ఆధీనంలోకి వస్తే.. అక్కడి నుంచి తమ విమానాల్లో కాబూల్‌కు వెళ్లవచ్చని వారు భావిస్తున్నారు. అంతేకాదు తాలిబన్లపై దాడి చేసేందుకు అప్గాన్ సైన్యం కాందహార్ విమానాశ్రయాన్ని ప్రధానంగా ఎంచుకుంది. ఇక్కడి నుంచే లాజిస్టిక్, వాయుసేన సహకారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాందహార్ ఎయిర్‌పోర్టును టార్గెట్ చేసి.. రాకెట్ దాడి చేశారు.

  ఆఫ్ఘనిస్తాన్‌లో సగం భాగం తమ ఆధీనంలో ఉందని తాలిబన్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 193 జిల్లా కేంద్రాలు, 10 సరిహద్దు జిల్లాలు తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. తాఖర్, కుందుజ్, బడఖ్‌షాన్, హెరాత్, ఫరాహ్ ప్రావిన్స్‌ల్లోని 10 బోర్డర్ క్రాసింగ్ పాయింట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 14 తర్వాత దాదాపు ANDSF సిబ్బంది తాలిబన్ల దాడుల్లలో మరణించారు. మరో 7వేల మంది గాయపడ్డారు. 1600 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. ఇక పౌరులపైనా ప్రతాపం చూపుతున్నారు తాలిబన్లు. వారి దాడిలో ఇప్పటి వరకు 2వేల మందికి పైగా పౌరులు చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరో 2,200 మంది గాయపడ్డారు.
  Published by:Shiva Kumar Addula
  First published: