హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Elections 2020: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై రికార్డులు సృష్టించిన కమలా హారిస్

US Elections 2020: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై రికార్డులు సృష్టించిన కమలా హారిస్

కమలా హారిస్ (ఫైల్ ఫోటో)

కమలా హారిస్ (ఫైల్ ఫోటో)

Kamala Harris: భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కమలా హారిష్ కావడం విశేషం.

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. ఆ దేశ 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక అమెరికా ఉపాధ్యక్షురాలిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ కూడా విజయం సాధించారు. భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కమలా హారిష్ కావడం విశేషం. ఇక ఈ పదవిని దక్కించుకున్న తొలి నల్ల జాతీయురాలు కూడా ఆమె కావడం మరో రికార్డ్. డెమొక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ బరిలో ఉండటంతో.. ప్రవాస భారతీయుల ఓట్లు ఎక్కువగా డెమొక్రటిక్ పార్టీకి పడ్డాయనే వాదన కూడా ఉంది. ఇక కమలా హారిస్ విజయంతో తమిళనాడులోని ఆమె తల్లి సొంత ఊరులో సంబరాలు మొదలయ్యాయి.

  అంతకుముందు అమెరికా అధ్యక్షుడు కావడానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లను జో బైడెన్ సాధించారు. సీఎన్ఎన్ న్యూస్ చానల్ తెలిపిన వివరాల ప్రకారం జో బైడెన్‌కు ఇప్పటి వరకు 273 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. పెన్సిల్వేనియాలో ఓట్ల లెక్కింపు తర్వాత బైడెన్‌ ఖాతాలో 20 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ అధ్యక్ష పీఠానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 270ని దాటారు. ఇక జో బైడెన్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టడం లాంఛనమే. ఎన్నికల ఫలితాలు పూర్తిగా ప్రకటించిన తర్వాత జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించడమే తరువాయి. జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడు కానున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటమి ఖాయమైంది. 2020లో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రావడానికి ముందు జో బైడెన్ ఒబామా హయాంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Kamala Harris, US Elections 2020

  ఉత్తమ కథలు