అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకు సిద్ధమవుతోంది. త్వరలో అక్కడి ప్రజలు తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే మరో సారి అవకాశం దక్కుతుందా.. లేదా జో బిడెన్ కు అధ్యక్ష పదవి వరిస్తుందా? అన్న అంశంపై ప్రజలు త్వరలో తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈ తరుణంలో అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన కమలా హారిస్ ఇటీవల ప్రచారంలో వర్షంలో డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అక్టోబర్ 19న ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేలో బహిరంగ ప్రచార కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆమె తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే వర్షం మధ్య గొడుగు పట్టుకుని డ్యాన్స్ చేశారు.
Kamala Harris is dancing in the Florida rain. pic.twitter.com/z2lxKMJ89e
— The Recount (@therecount) October 19, 2020
ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అనేక మంది హారిస్ డ్యాన్స్ బాగుందంటూ అభినందించారు. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌లో చూసిన గొప్ప వీడియో ఇదేనంటూ ప్రశంసలు గుప్పించారు. ఈ అంశంపై మరకరు కామేంట్ చేస్తూ.. ఈ వీడియోను పదేపదే చూస్తానని, రాబోయే ఎన్నికల్లో హారిస్ మరియు జో బిడెన్ కు ఓటు వేస్తానని చెప్పడం విశేషం. ఈ వీడియో చూశాను. అది ట్రంప్ ను మరిచిపోయేలా చేసిందంటూ మరొకరు కామెంట్ చేశారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్... డెమెక్రాట్ల తరపున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా రేసులో నిలుస్తున్నారు. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్. తమిళనాడు, చెన్నైలోని ఓ బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందినవారు. 1960లో అమెరికాకి వలస వెళ్లిపోయారు. కమలా హారిస్ తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకా వాసి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో అధ్యక్ష అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్‌ల మధ్య చర్చ కొనసాగుతుంది. ఎన్నికలకు రెండు వారాల కంటే తక్కువ సమయం ఉండటంతో.. అందరి దృష్టి ఈ డిబేట్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ డిబేట్‌లో కరోనాతో పాటు, ట్రంప్ అనుసరించిన వలస విధానంపై హోరా హోరిగా చర్చ జరిగింది. కరోనా మరణాల చీకటి కాలాన్ని ఆరికట్టడానికి ట్రంప్ ఎలాంటి ప్రణాళికలు చేపట్టలేదని బిడెన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్షలాది మంది మరణాలకు కారణమైన వ్యక్తికి మాట్లాడే అర్హత లేదని ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. బిడెన్ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్.. వైద్యంలో పురోగతి సాధించడం ద్వారా కరోనా త్వరలోనే అంతమవుతుందని వ్యాఖ్యానించారు. తొలి డిబేట్ తర్వాత కరోనా బారినపడిన తాను కోలుకున్నానని కూడా ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, Kamala Harris