HOME »NEWS »INTERNATIONAL »kamala harris americans eagerly buying future is female socks ahead of kamala harris swearing in here is the key reason nk

Kamala Harris: అమెరికాలో కమలా హారిస్ క్రేజ్... ఆ సాక్స్ తెగ కొంటున్నారుగా...

Kamala Harris: అమెరికాలో కమలా హారిస్ క్రేజ్... ఆ సాక్స్ తెగ కొంటున్నారుగా...
అమెరికాలో కమలా హారిస్ క్రేజ్ (image courtesy - instagram - meena)

US President: ఆ సాక్స్‌కీ కమలా హారిస్‌కీ ఏంటి సంబంధం? ఎందుకు ప్రజలు ఎగబడి వాటిని కొంటున్నారు? సడెన్‌గా అక్కడి ప్రజలకు ఆ సాక్స్ కొనుక్కోవాలనే కోరిక ఎందుకు కలిగింది?

  • Share this:
    Kamala Harris: జనరల్‌గా సెలబ్రిటీలను ప్రజలు ఫాలో అవుతుంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లు ఏ కాస్ట్యూమ్స్ వాడితే... ఫాన్య్ కూడా వాటిని వాడేందుకు ఇష్టపడతారు. ఐతే... రాజకీయ నాయకుల విషయంలో ఇలాంటి కాస్ట్యూమ్ ఫాలోయింగ్ ఉండదు. అమెరికాలో మాత్రం బుధవారం కొత్త ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భారత సంతతి వనిత కమలా హారిస్‌కి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే... ఆమె వేసుకునే సాక్స్‌ని కూడా ఎగబడి కొంటున్నారు ప్రజలు. ఇప్పుడా సాక్స్ కంపెనీ పండగ చేసుకుంటోంది. అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటే... డబ్బు అలా వచ్చి పడుతోంది. ఐతే... ఈ సాక్స్ వెనక ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ నడిచింది.

    కమలా హారిస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఐతే... ఆమె ఏనాడూ తన కాస్ట్యూమ్స్ గురించి వివరాలేవీ చెప్పేందుకు ఆసక్తి చూపరు. ఓన్లీ రాజకీయ అంశాలపైనే పోస్టులు చేస్తుంటారు. తాజాగా ఆమె మేనకోడలు మీనా హారిస్... ఓ వీడియోని టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో కమలా హారిస్ ఉన్నారు. అందులో మీనా... కమలా హారిస్‌కి పీచ్ పండ్ల ఫ్లేవర్ ఉన్న మింట్స్ జార్ ఇచ్చారు. అలా ఇస్తూ... ఇం"పీచ్‌""మింట్స్"(Im-peach-mints) అనే పదం వాడారు. మొదట ఆ ఇంపీచ్‌మింట్స్ పదానికి ఉన్న అర్థాన్ని కమలా హారిస్ గుర్తించలేదు. వెంటనే గుర్తించి... పకపకా నవ్వేశారు. ఇంపీచ్‌మెంట్ అంటే అభిశంసన. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రెండోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడాన్ని గుర్తుచేస్తూ మీనా హారిస్... ఇలా పీచ్ పండ్ల ఫ్లేవర్ మింట్స్ ఇచ్చి... సెటైర్ వేశారన్నమాట.


    View this post on Instagram

    A post shared by Meena Harris (@meena)



    ఈ టిక్ టాక్ వీడియోని కోటి మందికి పైగా చూశారు. ఇదే వీడియోను మీనా... ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. ఇది చూసిన వారంతా నవ్వుతున్నారు. అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఐతే... ఈ వీడియోలో కమలా హారిస్ వేసుకున్న సాక్స్ పై ఫ్యూచర్ ఈజ్ ఫిమేల్ (భవిష్యత్తు మహిళలదే) అనే డైలాగ్ ఉంది. ఈ సాక్స్‌ని గంబాల్ పూడిల్ (Gumball Poodle) కంపెనీ తయారుచేసింది. వీటి విలువ 13 డాలర్లు. మన రూపాయిల్లో రూ.951. ఈ సాక్స్‌ని ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమెరికన్లు తెగ కొంటున్నారు. ఎంతలా అంటే... చివరకు వీటిని వెంటనే డెలివరీ చేయలేని పరిస్థితికి ఆ కంపెనీ వచ్చేసింది. ఉన్న స్టాక్ మొత్తం అయిపోయింది.

    ఇది కూడా చదవండి: పచ్చ, కెంపు, రూబీ, రత్నం, వజ్రం... ఏ నెలలో పుట్టిన వారు ఏ రాయి తొడగాలి... తెలుసుకుందాం.

    మొత్తానికి కాబోయే అధ్యక్షుడు జో బిడెన్ కంటే కమలా హారిస్ ఇప్పుడు అమెరికాలో ట్రెండ్ అవుతున్నారు. ఆమెకు భారతీయుల సపోర్ట్ బాగా ఉండటంతో... ఇండియాలోనూ ఆమెకు కోట్ల మంది మద్దతుదారులు ఉన్నారు. అందువల్లే ఆమె ఏం చేసినా అదో ట్రెండ్ అయిపోతోంది.
    Published by:Krishna Kumar N
    First published:January 19, 2021, 07:05 IST

    टॉप स्टोरीज