ఏకే 47 కంపెనీ మరో అస్త్రం.. చీప్ రేట్లకే సూసైడ్ డ్రోన్లు...

సూసైడ్ డ్రోన్ (Image Credit: Washington Post)

తక్కువ ధర, సులువుగా ఆపరేట్ చేసే అవకాశం ఉండడంతో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఏకే 47ను కొనుగోలు చేశాయి. ఇప్పుడు డ్రోన్లు కూడా యుద్ధ రంగంలో కీలక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు.

 • Share this:
  ప్రపంచానికి ఏకే 47 లాంటి అస్త్రాన్ని అందించిన రష్యా కంపెనీ కలష్నికోవ్ గ్రూప్ మరో కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఆ అస్త్రం పేరు సూసైడ్ డ్రోన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఎగ్జిబిషన్‌లో ఈ సూసైడ్ డ్రోన్‌ను ప్రదర్శించారు. దీనితోపాటు పలు ఫైటర్ జెట్స్, అత్యంత అధునాతన యుద్ధ పరికరాలు ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. ప్రతి రెండేళ్లకు ఓసారి ఇలాంటి డిఫెన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ప్రపంచంలో ఆయుధాలు తయారు చేసే సంస్థలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొని తమ కొత్త కొత్త అస్త్రాలను ప్రదర్శిస్తుంటాయి.

  ఈ ఎగ్జిబిషన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది సూసైడ్ డ్రోన్. దీనికి అధికారికంగా KUB-UAV అని పేరు పెట్టారు. దీన్ని అత్యంత సులువుగా ఆపరేట్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. పోరాటం రూపురేఖల్ని మార్చగలిగిన సత్తా దీనికి ఉందని అభిప్రాయపడింది. ఈ సూసైడ్ డ్రోన్ నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది. 30 నిమిషాల వరకు ఎగరగలదు. గంటకు 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రెండున్నర కేజీల బరువైన మందుగుండును మోసుకెళ్లగలదు. టార్గెట్ నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చని కలష్నికోవ్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

  సూసైడ్ డ్రోన్ (Image Credit: Washington Post)


  ఈ సంస్థ తయారు చేసిన ఏకే 47 హాట్ కేక్‌. తక్కువ ధర, సులువుగా ఆపరేట్ చేసే అవకాశం ఉండడంతో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఏకే 47ను కొనుగోలు చేశాయి. అమెరికా ఆయుధాల ధర ఎక్కువ కావడంతో రష్యా కంపెనీ వైపు మొగ్గుచూపాయి. ఇప్పుడు డ్రోన్లు కూడా యుద్ధ రంగంలో కీలక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు.
  First published: