హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Kabul Blast: ఆఫ్ఘన్‌లో బాంబుల మోత.. కాబూల్‌ మసీదులో భారీ పేలుడు.. 20 మందికిపైగా మృతి

Kabul Blast: ఆఫ్ఘన్‌లో బాంబుల మోత.. కాబూల్‌ మసీదులో భారీ పేలుడు.. 20 మందికిపైగా మృతి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Kabul Blast: ఆప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి రక్తసిక్తమైంది. బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది.  కాబూల్‌లోని ఖైర్ ఖానా ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో బుధవారం భారీ పేలుడు సంభవించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan Talibans)లో పరిస్థితి మరింత దారుణంగా మారింది.  అరాచకాలు ఎక్కువయ్యాయి. ఉగ్రవాదులు పేట్రేటిపోతున్నారు.  అక్కడ జనజీవనం చాలా కష్టంగా మారింది.  బాంబు పేలుళ్లు, టెర్రరిస్టుల దాడులత నిత్యం ఎంతో మంది మరణించారు. తాజాగా ఆప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ (Kabul Blasts)మరోసారి రక్తసిక్తమైంది. బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది.  కాబూల్‌లోని ఖైర్ ఖానా ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో బుధవారం భారీ పేలుడు సంభవించింది. స్థానిక ప్రజలు మసీదులో నమాజు చేస్తున్న సమయంలో బాంబు పేలుళ్లు జరిగాయి.  పెద్ద శబ్దంతో భారీ పేలుడు (Kabul Explosion) సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మరో 40 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో మసీదు ఇమామ్ కూడా ఉన్నారు.

మసీదుకు సమీపంలో జరిగిన భారీ పేలుడులో పలువురు గాయపడ్డారని ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మరో మీడియా సంస్థ టోలో న్యూస్ తెలిపింది. బాంబు పేలుడుపై సమాచారం అందిన వెంటనే.. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించాయి. 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతుండగా.. స్థానిక మీడియా మాత్రం మృతుల వివరాలను వెల్లడించడం లేదు. తాలిబన్లకు భయపడే మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియదు. ఏ ఉగ్రసంస్థ కూడా దీనిపై ప్రకటన చేయలేదు. ఐతే దీని వెనక ఆఫ్ఘనిస్థాన్‌లో పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కూడా ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. మరో 18 మంది గాయపడ్డారు. కాబూల్‌లోని షియాలు అధికంగా ఉండే పీడీ6 ప్రభుత్వ నివాస ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ఓ కారులో బాంబులు పెట్టి పేల్చేశారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. వరుస ఉగ్రవాద ఘటనలు.. తాలిబన్ల అరాచక పాలనత.. కాబూల్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

First published:

Tags: Afghanistan, Bomb blast, International, Kabul

ఉత్తమ కథలు