హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Kaali Poster Row : ‘స్మోకింగ్ కాళీ’పై భారత ప్రభుత్వం ఆగ్రహం.. కెనడా సర్కారుకు ఘాటు లేఖ

Kaali Poster Row : ‘స్మోకింగ్ కాళీ’పై భారత ప్రభుత్వం ఆగ్రహం.. కెనడా సర్కారుకు ఘాటు లేఖ

వివాదాస్పద కాళీ పోస్టర్, రూపకర్త లీనా మణిమేకలై

వివాదాస్పద కాళీ పోస్టర్, రూపకర్త లీనా మణిమేకలై

కెనడాలో నివసిస్తోన్న భారతీయ ఫిలిం మేకర్, ఉద్యమకారిణి కాళీ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ పోస్టర్ పై వివాదం పెద్దదైంది. ఈ వ్యవహారంపై కెనడాలోని భారత రాయబార కార్యాలయం సైతం ఘాటుగా స్పందించింది.

కెనడాలో నివసిస్తోన్న భారతీయ దర్శకురాలు, ఉద్యమకారిణి లీనా మణిమేకలై తీరు పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాళీ పేరుతో ఆమె తాజాగా రూపొందించిన డాక్యుమెంటరీలో అమ్మవారి పాత్రలోని నటి.. సిగరెట్ తాగుతూ, చేతిలో ఎల్జీబీటీ జెండాను పట్టుకొని ఉన్న పోస్టర్ (Kaali Poster Row)పెను దుమారం రేపింది. ఈ వ్యవహారంపై కెనడాలోని భారత రాయబార కార్యాలయం సైతం ఘాటుగా స్పందించింది.

మహంకాళి అమ్మవారు పొగతాగుతున్న(స్మోకింగ్​ కాళీ) పోస్టర్ పై వివాదం పెద్దదైంది. హిందూ దేవతలను కించపరిచేలా ఇట్లాంటి పోస్టర్లు, చిత్రాలు తీయడం తగదంటూ పలు సంఘాలు ఫిర్యాదు చేసిన దరిమిలా ఒట్టావా (కెనడా)లోని భారత హైకమిషన్నిరసన తెలిపింది. చిత్రనిర్మాత లీనా మణిమేకలై రిలీజ్​ చేసిన ‘స్మోకింగ్ కాళి’ పోస్టర్‌పై కెనడా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత ఎంబసీ కోరింది. ఇలాంటి రెచ్చగొట్టే అంశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత అధికారులు కెనడాకు సూచించారు. అయితే దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

CM KCR : కేసీఆర్ వ్యూహం మారిందా? BRSకు బైబై.. TRSపైనే ఫోకస్ -20 నుంచి జిల్లాల పర్యటన!


ఆగాఖాన్ మ్యూజియంలో ‘అండర్ ది టెంట్’ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రదర్శించిన చిత్రం పోస్టర్‌పై హిందూ దేవుళ్లను అగౌరవంగా చిత్రీకరించడంపై కెనడాలోని హిందూ సంఘాల నేతల నుంచి ఫిర్యాదులు అందాయని భారత హైకమిషన్ తన లేఖలో పేర్కొంది. టొరంటోలోని తమ కాన్సులేట్ జనరల్ ఈ ఆందోళనలను ఈవెంట్ నిర్వాహకులకు తెలియజేశారని, అనేక హిందూ గ్రూపులు కెనడాలోని అధికారులను సంప్రదించి చర్య తీసుకోవాల్సిందిగా తమకు సమాచారం అందించాయని, కెనడా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు ఇట్లాంటి రెచ్చగొట్టే అంశాలన్నింటినీ తీసేయాలని లేఖలో కోరారు.

Kakatiya Utsav 2022 : జులై 7 నుంచి కాకతీయ వైభవ వారోత్సవాలు -రుద్రమ వంశీకుల రాక


కాగా, కాళీ డాక్యుమెంటరీ సంబంధిత పోస్టర్ వివాదాస్పదమైన తర్వాత కూడా చిత్ర నిర్మాత లీనా మణిమేకలై వెనక్కి తగ్గడంలేదు. తప్పు పట్టే ముందు సినిమా చూడాలని ఆమె వాదిస్తున్నారు. బతికున్నంతకాలం నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటానని, అందుకోసం జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా సిద్ధమేనంటూ లీనా వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత పెద్దది చేసినట్లయింది.

First published:

Tags: Canada, Hindu community leaders, India, Posters

ఉత్తమ కథలు