వరుస బాంబు పేలుళ్లతో చిగురుటాకులా వణికిపోయిన శ్రీలంకలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ పర్యటిస్తున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా జరిగిన వరుసబాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలైన బాధితులను పరామర్శించేందుకు హుటాహుటిన కేఏ పాల్ శ్రీలంకకు పయనమయ్యారు. ప్రపంచ శాంతి దూతగా అనేకమంది దేశాధ్యక్షులతో పర్సనల్ రిలేషన్ షిప్ కొనసాగించే కేఏ పాల్...శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్రా రాజపక్సెతో భేటిఅయ్యారు. మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసిన భేటీలో రాజపక్సేతో టీ తాగుతూ కేఏ పాల్ పరిస్థితిని సమీక్షించారు. అంతేకాదు బాంబుపేలుళ్లలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక మృతుల కుటుంబాల కోసం ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా అప్పీల్ చేశారు. అదే సందర్భంలో ఉగ్రవాదాన్ని అణిచివేసి ప్రపంచంలో శాంతి నెలకొనేలా చేసేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని, అందుకోసం తాను చొరవ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కేఏ పాల్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ka paul, Sri Lanka, Sri Lanka Blasts