హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఒక్క అణుబాంబు చాలు... ప్రపంచం నాశనమే... కొత్త పరిశోధన

ఒక్క అణుబాంబు చాలు... ప్రపంచం నాశనమే... కొత్త పరిశోధన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్, పాకిస్థాన్ మాత్రమే కాదు... ప్రపంచంలో చాలా దేశాలు తమ రక్షణ కోసం అంటూ వేలాది అణు బాంబుల్ని స్టోర్ చేసుకున్నాయి. ఐతే... ఈ ప్రపంచం మొత్తం నాశనం కావడానికి ఒక్క అణుబాంబైనా చాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకో, వారి పరిశోధనల్లో ఏం తేలిందో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

ప్రపంచ దేశాలన్నీ అణుబాంబుల్ని పెంచుకుంటూ... యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నాయి. పైకి అణ్వాయుధాల్ని వదిలేస్తామంటూనే తెరవెనక భారీ ఎత్తున స్టోర్ చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా దగ్గర కొన్ని వందల అణు బాంబులున్నాయి. రష్యాలో ఎన్ని ఉన్నాయో లెక్క లేదు. ఏ యుద్ధమో వచ్చి ఏ దేశమైనా ఈ భూమిపై ఏ ప్రాంతంలోనైనా అణుబాంబు వేస్తే... అది మొత్తం ప్రపంచం అంతం అవ్వడానికి దారి తీస్తుందంటున్నారు సైంటిస్టులు. కారణం రేడియేషన్ ఇతరత్రా పరిణామాలే. నెబ్రాస్కా-లింకన్ యూనివర్శిటీలో ఓ సైంటిస్టుల బృందం అణు బాంబుల ప్రభావంపై అధ్యయనం చేసింది. ఒక్క అణుబాంబు పడినా ఈ భూమికి ఎంతటి నష్టం కలుగుతుందో పక్కా లెక్కలతో అంచనా వేసింది.


హిరోషిమా, నాగసాకిపై పడిన అణుబాంబుల వల్ల ఇప్పటికీ ఆ ప్రాంతంలో అధిక రేడియేషన్ (రేడియో ధార్మిక అణువులు) ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పట్టణంలో 1300 చదరపు కిలోమీటర్ల పరిధిలో అణుబాంబు వేస్తే... దాని వల్ల 50 లక్షల టన్నుల బ్లాక్ కార్బన్ (బొగ్గు అణువులు) వాతావరణంలో (స్ట్రాటోస్పియర్‌లో) చేరుతుంది. ఫలితంగా ప్రపంచ దేశాల్లో మెల్లమెల్లగా వర్షాలు పడటం తగ్గిపోతుంది. దాని ఫలితంగా ప్రపంచ దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతాయి. తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది. ఇక ఆహారం లేకపోవడం వల్ల కోట్ల మంది చనిపోతారనీ... ముఖ్యంగా పేద దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. జస్ట్ ఐదేళ్లలో ప్రపంచం మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉందని తేల్చారు.


హిరోషిమాలో పడిన అణుబాంబు 15 కిలో టన్నుల బరువుంది. అది 13 చదరపు కిలోమీటర్ల పరిధిలో పడింది. ఆ బాంబుకి వంద రెట్లు శక్తిమంతమైన బాంబులు ఇప్పుడు ప్రపంచ దేశాల దగ్గర ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనాల దగ్గరున్న అణుబాంబుల్లో ఒక్కటైనా చాలు ఈ ప్రంపంచం సర్వనాశనం కావడానికి.


మూడో ప్రపంచ యుద్ధం గనక జరిగితే... దేశాల మధ్య వెంటవెంటనే కనీసం ఐదు అణుబాంబులైనా పడే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు. ముఖ్యంగా చైనా దగ్గర ఒక్కో అణుబాంబూ 5 మెగా టన్నుల బరువుంటుంది. అది ఒక్కటి చాలు ప్రపంచం నాశనం కావడానికి చైనా దగ్గర అలాంటి భారీ అణుబాంబులు దాదాపు 20 దాకా ఉన్నట్లు ఓ అంచనా.


అణుబాంబుల ప్రభావంపై 30 ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. అణుబాంబుల్ని పెంచుకుంటున్న అన్ని దేశాలకూ తెలుసు వాటి వల్ల కలిగే అనర్థాలు. అసలు వందల కొద్దీ అణుబాంబుల్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఐదారు బాంబులు పడేసరికే... ఈ ప్రంపంచం మొత్తం అంతమయ్యే పరిస్థితి ఉంటుంది. అది తెలిసీ ప్రపంచ దేశాల తీరు మారకపోవడం ఆందోళనకరం అంటున్నారు సైంటిస్టులు.


 

ఇవి కూడా చదవండి :


గుండెను బయటకు తీసి... నైవేద్యంగా ఇచ్చి... అజ్‌టెక్ తెగల త్యాగాల వెనక అసలు కారణాలివీ...


300 కోట్ల ఏళ్ల నాటి గోళాలు... గ్రహాంతర వాసులు తయారుచేశారా... మిస్టరీగా మిగిలిన ప్రశ్న


ఏటీఎం పిన్‌ మర్చిపోయారా... రీసెట్ చేసుకోవచ్చు... ఇలా చెయ్యండి...


తల లేకుండా 18 నెలలు బతికిన కోడి... ఎలా సాధ్యమైందంటే...


 

First published:

Tags: India VS Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2, Terror attack

ఉత్తమ కథలు