వీకీలీక్స్ అసాంజే ఆరోగ్య పరిస్థితి విషమం...జైలులో చనిపోయే ప్రమాదం...

అసాంజెను పరీక్షించిన 60 మంది వైద్యుల బృందం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అసాంజెని వేధింపులకు గురిచేస్తే బ్రిటన్‌ జైలులోనే ఆయన చనిపోయే ప్రమాదముందని వైద్యుల బృందం నిర్ధారించింది.

news18-telugu
Updated: November 26, 2019, 6:23 PM IST
వీకీలీక్స్ అసాంజే ఆరోగ్య పరిస్థితి విషమం...జైలులో చనిపోయే ప్రమాదం...
వీకీలీక్స్ అసాంజే ఆరోగ్య పరిస్థితి విషమం...జైలులో చనిపోయే ప్రమాదం...
  • Share this:
వికిలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజెకు చికిత్స అత్యవసరమని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు చికిత్స చేయకుంటే ఆస్పత్రిలోనే చనిపోయే ప్రమాదముందని ఈ సందర్భంగా హెచ్చరించారు. అసాంజెను పరీక్షించిన 60 మంది వైద్యుల బృందం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అసాంజెని వేధింపులకు గురిచేస్తే బ్రిటన్‌ జైలులోనే ఆయన చనిపోయే ప్రమాదముందని వైద్యుల బృందం నిర్ధారించింది. ఈ మేరకు అసాంజె ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ అందజేశారు. ఇదిలా ఉంటే వీకీలీక్స్ ద్వారా అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అసాంజె ప్రపంచం ముందు పెట్టి బహిర్గతం చేశారు. లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజె బ్రిటన్‌ జైలులో శిక్ష పొందుతున్నారు.
Published by: Krishna Adithya
First published: November 26, 2019, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading