ఆ ఇద్దరి పెళ్లికి ఒప్పుకోని జడ్జి.. దేవుడి చట్టమే కారణమన్న న్యాయమూర్తి

తాను స్వలింగ జంట వివాహాన్ని ఆమోదించబోనని... ఇది క్రైస్తవ నైతికతకు విరుద్ధమని ఫ్లోరెజ్ తీర్పునిచ్చాడు.

news18-telugu
Updated: September 8, 2020, 6:54 PM IST
ఆ ఇద్దరి పెళ్లికి ఒప్పుకోని జడ్జి.. దేవుడి చట్టమే కారణమన్న న్యాయమూర్తి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొలంబియాలో స్వలింగ వివాహం చట్టబద్దమైనప్పటికీ అక్కడి న్యాయమూర్తి రామిరో ఫ్లోరెజ్ ఇద్దరు మహిళల వివాహానికి నిరాకరించాడు. జూలియత్ డెల్ కార్మెన్ రామోస్, గుస్కరీ అలెజాండ్రా వాస్క్వెజ్ అనే ఇద్దరు మహిళల మధ్య వివాహాన్ని ఆమోదించడానికి ఫ్లారెజ్ నిరాకరించాడు. దేశంలో స్వలింగ వివాహం చట్టబద్ధమైనప్పటికీ 'దేవుని చట్టాన్ని' పాటించాలని ఫ్లోరెజ్ పేర్కొన్నారు. ఒకే లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహ నిషేధాన్ని రద్దు చేసిన 6–-3 కోర్టు తీర్పును అనుసరించి, 2016 ఏప్రిల్ 28 నుండి కొలంబియాలో స్వలింగ వివాహం చట్టబద్ధంగా పరిగణించబడింది.

కాగా తాజాగా న్యాయమూర్తి రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇవ్వడంపై అక్కడి ప్రజలు, నాయకుల నుండి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. ఈ తీర్పుపై సెనేటర్ రాయ్ బారెరాస్ సహా అధికారులు ఖండింస్తూ మేజిస్ట్రేట్‌పై ఆంక్షలు విధిస్తామన్నారు. ఆగస్టు 31 ఇచ్చిన కోర్టు తీర్పు ప్రకారం, కార్టజేనాకు చెందిన న్యాయమూర్తి రామిరో ఫ్లెరెజ్ జూలియత్ డెల్ కార్మెన్ రామోస్ మరియు గుస్కరీ అలెజాండ్రా వాస్క్వెజ్ల మధ్య వివాహం కుదుర్చుకోవడానికి నిరాకరించారు. ఇది తన మత విశ్వాసానికి విరుద్ధం అయినందువల్ల నిరాకరిస్తున్నానని తెలిపారు.

తాను స్వలింగ జంట వివాహాన్ని ఆమోదించనని... ఇది క్రైస్తవ నైతికతకు విరుద్ధమని ఫ్లోరెజ్ తీర్పునిచ్చాడు. మానవ చట్టం చెప్పేదానికి మరియు దేవుని చట్టం చెప్పే వాటికి మధ్య విభేదాలు ఉన్నప్పుడు, తాను దేవుని చట్టాన్ని ఇష్టపడతానని అన్నాడు. తన ప్రభువు మానవుడని కంటే గొప్పవాడని.. తన దేవుణ్ణి సంతోషపెట్టడానికే ఇష్టపడతానని పేర్కొన్నారు.

ఈ తీర్పుని వ్యతిరేఖిస్తూ సెనెటర్ లోజానో 'సుప్రీం కౌన్సిల్ ఫర్ జ్యుడిషియరీ మరియు అటార్నీ జనరల్ కార్యాలయానికి ఆ దంపతులకి రక్షణగా నిలిచి వారి హక్కులను దుర్వినియోగం చేసిన న్యాయమూర్తికి శిక్ష విధించే అవకాశం ఉంది' అని ట్వీట్ చేశారు. సెనెటర్ రాయ్ బారెరాస్ ఫ్లోరెజ్ తీర్పును తిరస్కరించడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమైన తీర్పునిచ్చిన మెజిస్ట్రేట్‌పై చట్ట ప్రకారం ఆంక్షలు విధిస్తానన్నారు. వీరి వివాహానికి ఎల్జీబీటీ రైట్స్ గ్రూపు సహాయం చేసింది. కాగా స్వలింగ వివాహాలు చేసుకునే వారిని ఎల్జిబిటిగా పిలుస్తారు.
Published by: Kishore Akkaladevi
First published: September 8, 2020, 6:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading