చనిపోయిన రష్యన్ జర్నలిస్ట్ బతికొచ్చాడు..!

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:11 PM IST
చనిపోయిన రష్యన్ జర్నలిస్ట్ బతికొచ్చాడు..!
  • News18
  • Last Updated: June 6, 2018, 3:11 PM IST
  • Share this:
రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ లో రష్యన్ జర్నలిస్టు ఆర్కాదీ బాబ్షెంకోను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో దారుణంగా కాల్చి చంపారు. కీవ్ లో తన ఇంటికి వెళ్తుండగా అతడిని కాల్చారు. బుల్లెట్ శబ్దం విన్న ఆయన భార్య బయటికొచ్చి చూసింది. తీవ్ర గాయాలతో రక్త మడుగులో ఉన్న భర్తను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలనే చనిపోయాడు. జర్నలిస్ట్ హత్య ఉక్రెయిన్ ల సంచలనం రేపింది.

జర్నలిస్ట్ హత్యలో రియల్ క్లైమాక్స్ ఏంటంటే.. చనిపోయిన 24 గంటల తర్వాత అర్కాదీ ప్రాణాలతో తిరిగొచ్చాడు. అవును ఇది నిజం. ఉక్రెయిన్  భద్రతా అధికారులు మీడియా సమావేశంలో అతడు కనిపించి.. అందరినీ షాక్ కు గురిచేశాడు. ఐతే అతడు చనిపోలేదు. భద్రతా అధికారులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా..  ఆర్కాదీ చనిపోయినట్లు ప్రచారం చేశారు. అతన్ని చంపేందుకు రష్యా చేసిన కుట్రను బయటపెట్టేందుకే తప్పుడు వార్తను ప్రచారం చేశారు.

అసలు కథ ఇది:

జర్నలిస్టు ఆర్కాదీ బాబ్షెంకో .. రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసేవారు.  పుతిన్ ప్రభుత్వ విధానాలపై బాహాటంగానే తీవ్ర విమర్శలు చేసేవారు. 2016లో కూలిపోయిన రష్యన్ మిలటరీ విమానం గురించి ఎన్నో సంచలన కథనాలు రాశారు.ఆ తర్వాత ఆర్కాదీని చంపేస్తామని బెదిరింపులు రావడంతో...2017లో రష్యా విడిచి వెళ్లాడు. మొదట ప్రేగ్ వెళ్లి..అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్లారు. గత ఏడాది నుంచి కీవ్ ఆర్కాదీ నివసిస్తున్నారు.కీవ్ లో నివసిస్తున్న ఆర్కాదీని చంపేందుకు రష్యా భద్రతా దళాలు కుట్ర చేసినట్లుగా ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ కు సమాచారం ఉంది. వారి కథనం ప్రకారం.. ఆర్కాదీని చంపేందుకు ఉక్రెయిన్ కు చెందిన ఓ వ్యక్తిని రష్యా నియమించింది. అతడితో 40 వేల డాలర్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ విషయం తెలిసిన ఆర్కాదో, ఉక్రెయిన్ అధికారులు  రష్యా కుట్రలను  బయటపెట్టేందుకే ఈ సీక్రెట్ ఆపరేషన్ చేశారు. అనుకున్నట్లగానే కుట్రను బట్టబయలు చేసిన జర్నలిస్ట్ ను కాపాడారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆర్కాదీ ప్రత్యక్షం:

స్టింగ్ ఆపరేషన్ వివరాలను బయటపెట్టేందుకు కీవ్‌లో ఉక్రెయిన్ అధికారులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. దానికి ఆర్కాదీ కూడా రావడంతో అక్కడున్న జర్నలిస్టులు షాకయ్యారు. ఆర్కాదీ మొదట తన భార్యకు క్షమాపణలు చెప్పారు. తాను ప్రాణాలతో బయటపడి.. రష్యా కుట్రను బయటపడేందుకే ఇలా చేశామని తెలిపారు. ఇక ఆర్కాదీని చంపేందుకు రష్యా నియమించిన కిరాయి హంతకులను..ప్రెస్‌మీట్‌కు ముందే ఉక్రెయిన్ పోలీసులు అదుపులోకి తీసుకుననారు. చనిపోయాడుకున్న ఆర్కాదీ తిరిగి రావడంతో మిగతా జర్నలిస్టులు ఆశ్చర్య పోయారు. తమ మిత్రుడు బతికే ఉన్నాడని  తెలిసి సంబరాలు చేసుకున్నారు.


2014లో క్రిమియాను రష్యా తనలో కలిపేసుకుంది. అంతేకాదు ఉక్రెయిన్ లోని తూరపు ప్రాంతాలను రష్యా అనుకూల బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పరిణామాలతో రష్యా-ఉక్రెయిన్ మధ్య కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: May 31, 2018, 7:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading