Home /News /international /

JOINT STATEMENT OF THE LEADERS OF THE 5 NUCLEAR WEAPONS COUNTRIES GH VB

P5 Countries Pledge: గ్లోబల్ న్యూక్లియర్ రేస్‌ను ముగించేందుకు P5 దేశాల ప్రతిజ్ఞ.. ఒప్పందంపై 5 శక్తిమంతమైన దేశాల సంతకాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలుగా పేరిందిన P5 దేశాలు అరుదైన ప్రతిపాదనపై ప్రతిజ్ఞ చేశాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌ దేశాలు అణు యుద్ధాల నివారణకు ఉమ్మడిగా వాగ్దానం చేశాయి.

ఇంకా చదవండి ...
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలుగా పేరిందిన P5 దేశాలు(Country) అరుదైన ప్రతిపాదనపై ప్రతిజ్ఞ(Pledge) చేశాయి. ఐరాస భద్రతా మండలిలో(Security Council) శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా(Russia), బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌(France) దేశాలు అణు యుద్ధాల నివారణకు ఉమ్మడిగా వాగ్దానం చేశాయి. "అణు యుద్ధం ఏనాటికీ గెలవదు" అని ఈ సందర్భంగా ప్రకటన చేశాయి. అణ్వాయుధాలను రక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించేలా P5 దేశాలు జాయింట్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి. "అణు యుద్ధంలో విజయం సాధించలేం.. అణ్వస్త్రాలతో ఎప్పటికీ పోరాడకూడదు కూడా" అనేది ఈ ఒప్పందం పూర్తి సారాశం. జనవరి 4న సంతకం చేసిన సంయుక్త ప్రకటనలో దేశరక్షణకు మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగించాలని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాయి. 1968 అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) ద్వారా ఐదు అణ్వాయుధ దేశాలుగా P5 కంట్రీస్‌కు గుర్తింపు ఉంది.

Cars Set Ablaze: న్యూ ఇయర్ వేడుక మామూలుగా లేదుగా.. 874 కార్లను దహనం చేసేశారు.. ఎక్కడంటే..


P5 సభ్యుల సంయుక్త ప్రకటన ఏంటి..?
"అణు వినియోగం భయంకరమైన, దీర్ఘకాలిక పర్యవసానాలకు దారితీస్తుంది. కాబట్టి అణ్వాయుధాలు ఉనికిలో ఉన్నంత కాలం రక్షణ ప్రయోజనాలకు, దూకుడు స్వభావాన్ని అణచివేయడానికి, యుద్ధాన్ని నిరోధించడానికి మాత్రమే ఉపయోగించాలని మేం నొక్కి వక్కాణిస్తున్నాం. అటువంటి ఆయుధాలు మరింత వ్యాప్తి చెందకూడదని మేం గట్టిగా నమ్ముతున్నాం." అని తాజాగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో దేశాలు పేర్కొన్నాయి. చాలా నెలలుగా P5 సమావేశాలలో సమాలోచన చేశాక ఈ ప్రకటన విడుదలైందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు.

"ఇది చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన డాక్యుమెంట్ అని నేను చెబుతాను. అణ్వాయుధాలకు సంబంధించిన సమస్యలపై ఐదు అణ్వాయుధ దేశాల నాయకులు చేసిన మొదటి ఉమ్మడి ప్రకటన ఇది. P5 నాయకులు.. ఐదు అణ్వాయుధ దేశాలకు చెందిన నాయకులు అని మీకు తెలుసు. ఈ దేశాలు తరచుగా ఉమ్మడి ప్రకటనలు ఇవ్వవు." అని పేర్కొన్నారు చైనా ఆయుధ నియంత్రణ అండ్ నిరాయుధీకరణ విభాగం డీజీ ఫు కాంగ్. NPT ఐదు-సంవత్సరాల సమీక్ష సమావేశంతో సమానంగా P5 తాజా ప్రకటనకు విలువ ఉండనుంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడింది.

Noise Colorfit Ultra 2: మార్కెట్​లోకి నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 స్మార్ట్​వాచ్ లాంచ్​.. 60 స్పోర్ట్స్​ మోడ్​ల్స్..


కీలక సమయంలో ప్రకటన..
పసిఫిక్‌లో చైనా సైనిక ఉనికి పెరుగుదలపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలోనే ఐదు దేశాలు తాజాగా వాగ్దానం చేశాయి. తైవాన్‌ను ప్రధాన భూభాగంతో తిరిగి కలపడానికి సైనిక బలగాలను ఉపయోగించేందుకు చైనా సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్‌పై మాస్కో, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ ప్రకటన విడుదలైంది.

ఇటీవల యూఎస్, బ్రిటన్‌తో ఆస్ట్రేలియా కొత్త రక్షణ ఒప్పందాన్ని ఖండిస్తూ దానిని బాధ్యతా రహితమైనదిగా చైనా పేర్కొన్న విషయం తెలిసిందే. క్వాడ్‌ను చైనా వ్యతిరేక కూటమిగా పేర్కొంటూ బీజింగ్, మాస్కో విమర్శించాయి. అణ్వాయుధాల నిల్వను పెంపొందించుకునే దిశగా చైనా చేస్తున్న దూకుడుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి చైనా 1,000 అణు వార్‌హెడ్‌లను కలిగి ఉండవచ్చని పెంటగాన్ నివేదిక అంచనా వేసింది. హైపర్‌సోనిక్ క్షిపణిలో చైనా పురోగతిపై అమెరికా ఉన్నత స్థాయి జనరల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చైనా హైపర్‌సోనిక్ క్షిపణులు సైనిక శక్తి సమతుల్యతలో ప్రాథమిక మార్పుని సూచిస్తున్నాయని జనరల్ మార్క్ మిల్లీ పేర్కొన్నారు.

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకుంటే హ్యాక్​ అయ్యే ప్రమాదం..


P5 ప్రతిజ్ఞపై ప్రశ్నలు లేవనెత్తిన నిపుణులు..
ఈ ప్రతిజ్ఞను ఆర్మ్స్ కంట్రోల్ అడ్వకేట్లు స్వాగతించినా.. అణు యుద్ధం ప్రమాదం ఆందోళనలు ఇంకా సమసిపోలేదని చెబుతున్నారు. ప్రతిజ్ఞపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు.. ప్రతిజ్ఞ తర్వాత కూడా ఆత్మరక్షణ సాకుతో P5 దేశాలు అణ్వాయుధాలను ఉపయోగించినా ఉపయోగించొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిజ్ఞ తన ఆయుధాగారం నిరోధక ప్రభావాన్ని అణగదొక్కే అవకాశం లేకపోలేదని ఫ్రాన్స్ ఆందోళన చెందుతోంది. నిరాయుధీకరణ ప్రక్రియలో ప్రతిజ్ఞకు ఎంతోకాలం దేశాలు కట్టుబడి ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

NPT అంటే ఏమిటి..?
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ) అనేది అణ్వస్త్ర, అణ్వస్త్రేతర దేశాల మధ్య జరిగిన ఒక ఒప్పందం. అణ్వాయుధాలు కొనుగోలు చేయబోమని ఇతర దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. తమ అణ్వాయుధాల బలాన్ని తగ్గిస్తామని ఐదు దేశాలు హామీ ఇచ్చాయి. 1968లో ఎన్‌పీటీ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, 1970 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఒప్పందాన్ని మరిచి నిరాయుధీకరణకు బదులుగా తమ అణ్వాయుధాల ఆధునీకరణ ఐదు దేశాలు మొగ్గు చూపాయి. ఎన్‌పీటీ కింద అణ్వాయుధాలను కలిగి ఉన్న నాలుగు దేశాలుగా గుర్తింపు పొందని ఇజ్రాయెల్, భారతదేశం, పాకిస్థాన్, ఉత్తర కొరియా కూడా అణ్వాయుధాలను పెంచుకున్నాయి.

Aeroplane Accident: ఆకాశంలో ఎగురుతున్న విమానం విండ్‌స్క్రీన్‌కు బీటలు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు..

2015 నాటి ఇరాన్ అణు ఒప్పందం విచ్ఛిన్నం కావడంతో మధ్యప్రాచ్యంలో న్యూక్లియర్ కార్యక్రమాల విస్తరణ ప్రమాదాలు పెరిగాయి. అయితే తాజా ప్రతిజ్ఞ ద్వారా గ్లోబల్ న్యూక్లియర్ రేస్‌ను అంతం చేయడం, అణు యుద్ధాలను తగ్గించడం.. వంటి కీలక అంశాలను P5 దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. త్వరలో జరగనున్న ఎన్‌పీటీ సమీక్షా సమావేశంలో ఈ ప్రతిజ్ఞ సానుకూల వాతావరణం నెలకొల్పే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: America, France, Mou, Russia

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు