Home /News /international /

JOHNSON AND JOHNSON TO END GLOBAL SALES OF TALC BASED BABY POWDER HERE ARE MORE DETAILS SK

Baby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సంచలన నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Johnsons Baby powder: గత దశాబ్ద కాలంలో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలపై వేలాది వినియోగదారులు భద్రతా వ్యాజ్యాలను కోర్టుల్లో దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన అమెరికా కోర్టు.. కంపెనీకి ఏకంగా రూ.15,000 కోట్ల జరిమానా విధించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఫార్మా కంపెనీ జాన్సన్ & జాన్సన్ (Johnson and Johnson) సంచలన నిర్ణయం తీసుకుంది. బేబీ టాల్కమ్ పౌడర్ (Baby Talcum Powder) అమ్మకాలను 2023లో ప్రపంచవ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే 2023 తర్వాత జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ మార్కెట్లో కనిపించదు. అమెరికాలో వేలాది మంది ఈ పౌడర్‌పై కేసులు వేయడం వల్ల.. ఆ ఉత్పత్తిని విక్రయించడాన్ని నిలిపివేసినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఎన్నో దేశాల్లో బేబీ పౌడర్ విక్రయాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ పౌడర్‌ను తీసుకొస్తామని తెలిపింది.

    జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ 2020లో అమెరికా (America), కెనడా (Canada)లో తన పౌడర్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేసింది. ఈ పౌడర్‌లో హానికరమైన ఆస్బెస్టాస్ ఫైబర్ ఉందని.. ఇది కాన్సర్‌కు కారణమని ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేశారు. 35 వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కంపెనీపై కేసులు పెట్టారు. ఈ కారణంగా అమెరికాలో జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలోనే 2020లో అమెరికా, కెనడాలో బేబీ పౌడర్ అమ్మకాలు తగ్గిపోతున్నాయనే కారణంతో.. దాని అమ్మకాలను నిలిపివేసింది. అయితే బ్రిటన్‌తో సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో ఇప్పటికీ విక్రయిస్తోంది.

    గత దశాబ్ద కాలంలో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలపై వేలాది వినియోగదారులు భద్రతా వ్యాజ్యాలను కోర్టుల్లో దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన అమెరికా కోర్టు.. కంపెనీకి ఏకంగా రూ.15,000 కోట్ల జరిమానా విధించింది. పసిపిల్లల ఆరోగ్యంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆడుకుంటోందని కోర్టు వ్యాఖ్యానించింది. కంపెనీ ఉత్పత్తుల్లో ఆస్‌బెస్టాస్‌ను కలుపుతున్నారని.. ఇది గర్భాశయ కాన్సర్‌కు దారితీస్తోందని తెలిపింది. కంపెనీ చేసిన నేరాన్ని డబ్బుతో పోల్చలేమని కూడా న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ నేరాలు పెరిగినప్పుడు.. పరిహారం కూడా పెద్దదిగా ఉండాలన్న ఉద్దేశంతో.. 15వేల కోట్ల జరిమానా విధించారు.



    జాన్సన్ బేబీ పౌడర్ ఇప్పటి కాదు. 1894 నుంచీ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది. చిన్న పిల్లలు ఉండే ప్రతి కుటుంబంలోనూ దీన్ని వినియోగించారు. కానీ అమెరికా, కెనడాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం, కోర్టు జరిమానా విధించడంతో..ఆ ప్రభావం ఇతర దేశాల్లో కూడా పడింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌కు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే బేబీ టాల్కమ్ పౌడర్‌ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amercia, International, International news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు