JOE BIDENS SWEARING IN EVENT LADY GAGA AND JENNIFER LOPEZ WILL PERFORM IN THE EVENT SU
Lady Gaga - Jennifer Lopez: జోరుగా బైడెన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సింగర్ల ప్రదర్శన
జెన్నీఫర్ లోఫెజ్, లేడీ గగా
Bidens Swearing-in Event: మరికొద్ది రోజుల్లోనే అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురేషన్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.
మరికొద్ది రోజుల్లోనే అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురేషన్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 20న జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గగా, ప్రఖ్యాత సింగర్ జెన్నీఫర్ లోఫెజ్, అమెరికన్ కవయత్రి అమండా గోర్మాన్ ప్రదర్శన ఇవ్వనున్నట్టు ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురేషన్ కమిటీ గురువారం ప్రకటించింది. ముందుగా 1989 నుంచి 2001 వరకు జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడిగా ఉన్న జెసూట్ కాథలిక్ ప్రిస్ట్ ఫాదర్ లియో జె ఓ డోనోవన్ చేత ఆహ్వానం కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్ లోకల్ 3920 అధ్యక్షురాలిగా ఉన్న ఆండ్రియా హాల్ చేతుల మీదుగా ప్రతిజ్ఞ కార్యక్రమం ఉండనుంది. ఆమె జార్జియాలో 20 ఏళ్లకు పైగా ఫైర్ ఫైటర్‌గా సేవలు అందించారు. కెప్టెన్‌గా పదోన్నతి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా నిలిచారు.
ఇక, జాతీయ గీతాన్ని లేడీ గగా అలపించనున్నారు. లేడీ గగా పరోపకారిగా పేరు తెచ్చుకోవడంతో పాటు, మెంటల్ హెల్త్‌కు సంబంధించిన అంశాలపై, LGBTQ వర్గాల హక్కుల పోరాటలకు, హెచ్ఐవీ అవగాహనకు ఆమె మద్దుతుగా నిలిచారు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ సమయంలో కాలేజ్ ప్రాంగణాల్లో సెక్సువల్ వేధింపులను పరిష్కరించడానికి ఎన్నుకున్న బైడెన్ కమిటీతో కలిసి లేడీ గగా పనిచేశారు. అమండా గోర్మాన్ చేత కవితల పఠనం చేయించనున్నారు.
అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా పరిగణించబడే జెన్నీఫర్ లోఫెజ్ సంగీత ప్రదర్శగా ఇవ్వనున్నారు. న్యూయార్క్ నగరానికి చెందిన జెన్నీఫర్ నటిగా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా, నిర్మాతగా, బిజినెస్ ఉమెన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక, ఈ నెల 20న బైడెన్ క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్‌లో దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే సమయంలో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్ వంటి ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇక, ట్రంప్ ఈ వేడుకకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.