Joe Biden: జో బిడెన్ గెలుపు ఇండియాకి ఎంతవరకూ ప్రయోజనం?... మనకు అనుకూలమేనా?

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ గెలుపు ఇండియాకి అనుకూలంలా కనిపిస్తున్నా... తెరవెనక కొన్ని అంశాలు... సందేహంగా మారుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 8, 2020, 7:11 AM IST
Joe Biden: జో బిడెన్ గెలుపు ఇండియాకి ఎంతవరకూ ప్రయోజనం?... మనకు అనుకూలమేనా?
జో బిడెన్ (File)
  • Share this:
Joe Biden: అమెరికాలో ఇన్నాళ్లూ అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కీ... ఇకపై అధ్యక్షుడు కాబోతున్న జో బిడెన్‌కీ ఓ ప్రధాన తేడా ఉంది. ట్రంప్ ఏ విషయమైనా సూటిగా చెప్పేస్తారు. బిడెన్ మాత్రం కాస్త మెతకవైఖరితో... సూటిగా చెప్పరు కానీ... చివరకు ఆయన కూడా అమెరికా ఫస్ట్ అనే విధానాన్నే అవలంబిస్తారనే వాదన ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ గెలవాలని భారతీయులు కోరుకోవడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. 1.ట్రంప్‌పై ఉన్న ఆగ్రహం. 2.ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ని ఎంచుకోవడం. ఐతే... భారత్‌పై ప్రేమతోనో, భారతీయులపై అభిమానంతోనో జో బిడెన్ కమలా హారిస్‌ని ఎంచుకోలేదు. ట్రంప్‌పై ఆగ్రహంతో ఉన్నవారిలో ఆఫ్రికన్లు, ఆసియా ప్రజలే ఎక్కువ. నల్ల జాతీయుల ఓట్లు రాబట్టాలంటే... వారికి అనుకూలమైన వ్యక్తినే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోవడం ద్వారా... తెలివైన రాజకీయ ఎత్తుగడ వేశారు బిడెన్. ఇదే కాదు... ప్రతి అంశంలోనూ బిడెన్ ఇలాగే వ్యవహరిస్తారు. పైకి కనిపించేది ఓ కోణం ఉంటే... తెరవెనక వ్యూహం మరోలా ఉంటుంది.

Joe Biden, joe biden on india, joe biden vs trump, joe biden india relationship, joe biden pakistan, joe biden on kashmir, joe biden politics, joe biden challenges, జో బిడెన్, భారత్‌తో జో బిడెన్ సంబంధాలు, జో బిడెన్ గెలుపు భారత్ దౌత్యం, జో బిడెన్ భారతీయులు,
నరేంద్ర మోదీ, జో బిడెన్ (File - credit - Wikimedia Commons)


ఇండియాకి లాభమా? నష్టమా?:
అమెరికాలో లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు కాబట్టి... జో బిడెన్ గెలుపు... భారత్‌, భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కీలక అంశం. ఇప్పటివరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... బిడెన్‌తో కలిపి... ముగ్గురు అమెరికా అధ్యక్షులతో డీల్స్ కుదుర్చుకున్నట్లు అవుతుంది. ఎన్నికల ప్రచారంలో... భారత్, అమెరికా సహజ భాగస్వాములు అనీ... తాము అధికారంలోకి వచ్చాక... రెండు దేశాల సంబంధాలను మరింత పటిష్టం చేసేలా చర్యలు తీసుకుంటామని బిడెన్ అన్నారు. అంతే తప్ప... స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వలేదు. అంటే వీసా రూల్స్ భారతీయులకు అనుకూలంగా చేస్తామనిగానీ, ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో ఎన్నారైలకు మేలు జరిగేలా చేస్తామని ఎక్కడా చెప్పలేదు.

నిజానికి జో బిడెన్ ఇదివరకు కొన్ని సందర్భాల్లో ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ చట్ట సవరణ (CAA), జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు. పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడారు. అందువల్ల జో బిడెన్ విషయంలో భారత్ మరీ అంత పాజిటివ్‌గా ఫీలవ్వాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ట్రంప్ విషయాన్నే తీసుకుంటే... పై రెండు అంశాల్లో ట్రంప్... సైలెంట్‌గా ఉన్నారే తప్ప... ఇండియాపై కన్నెర్ర జెయ్యలేదు. అలాగే... చైనా ఆక్రమణలపై మండిపడుతూ... ఇండియాకి మద్దతుగా మాట్లాడారు. ఇలా ట్రంప్... రాజకీయ వ్యవహారాల్లో ఇండియాకి అనుకూలంగా ఉంటూనే... వీసాలు, ఇమ్మిగ్రేషన్ చట్టాల విషయంలో మాత్రం ఇండియాకి వ్యతిరేకంగా... అమెరికాకు అనుకూలంగా వ్యవహరించారు.

బిడెన్ ఇదివరకు... చాలా సందర్భాల్లో... భారత అధికారులతో సత్సంబంధాలు నెరిపారు. 2008లో అమెరికా-భారత్ అణు ఒప్పందం జరిగినప్పుడు బిడెన్.. సెనెట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. అలాగే.. 2005లో నౌకా ఆయుధాల రవాణా చట్టంపై డీల్ కుదుర్చుకునేటప్పుడు ఆయన కో-స్పాన్సర్‌గా ఉన్నారు. ఆ డీల్ వల్ల భారత్... INS జలాశ్వ యుద్ధ నౌకను పొందింది.

ఇండియాకి అనుకూల పరిస్థితులు:

తన నాలుగేళ్ల దౌత్యపరమైన అనుభవాలతో జో బిడెన్... ఇండియా సహా ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు నెరుపుతూనే... పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఐతే... ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో విదేశాలతో సత్సంబంధాల కంటే... ముందు అమెరికాను చక్కదిద్దుకోవడం బిడెన్ ముందున్న సవాలు. కరోనా వైరస్ వల్ల అమెరికాయే అన్ని దేశాల కంటే ఎక్కువగా నష్టపోతోంది. దానికి తోడు నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో ఉంది. ఇవేవీ చక్కదిద్దకుంటా... ట్రంప్ సింపుల్‌గా తప్పించుకున్నట్లవుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాకు భారత్ అవసరం దౌత్యపరంగా, వాణిజ్యపరంగా చాలా ఉంది. అందువల్ల ట్రంప్ లాగే... జో బిడెన్ కూడా... ఇండియా పట్ల తన వైఖరి మార్చుకొని... పాజిటివ్‌గా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందువల్ల జో బిడెన్ విషయంలోనూ మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడమే భారతీయులకు మంచిదంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: November 8, 2020, 7:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading