HOME »NEWS »INTERNATIONAL »joe biden nominates 20 indian americans under his administration here is the full details of them nk

US President: జో బిడెన్ టీమ్‌లో 20 మంది ఇండియన్-అమెరికన్‌లు.. ఎవరు వారు?

US President: జో బిడెన్ టీమ్‌లో 20 మంది ఇండియన్-అమెరికన్‌లు.. ఎవరు వారు?
జో బిడెన్ టీమ్‌లో 20 మంది ఇండియన్-అమెరికన్‌లు.. ఎవరు వారు? (image courtesy - twitter)

US President: అమెరికా ఉప అధ్యక్షురాలిగా కమలా హారిస్ ఉండబోతుంటే... జో బిడెన్ టీమ్‌లో 20 మంది ఇండో-అమెరికన్‌లు ఉండబోతుండటం గొప్ప విషయమే.

  • Share this:
    US President: అమెరికా చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ఉపాధ్యక్షురాలు కాబోతోంది. అమె భారత సంతతి వనిత కమలా హారిస్ అని మనకు తెలుసు. ఇదే ఇండియాకి గొప్ప విషయం అనుకుంటే... తాజాగా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ఏకంగా 20 మంది ఇండియన్-అమెరికన్ లను తన పరిపాలనా విభాగంలో నామినేట్ చేశారు. వారిలో 13 మంది మహిళలే ఉండటం మరో విశేషం. ఈ 20 మందిలో చాలా మంది కీలకమైన పదవుల్లో ఉండబోతున్నారు. 20 మందిలో 17 మంది వైట్ హౌస్ కాంప్లెక్స్ పరిధిలో ఉండనున్నారు. ఈ నెల 20న అంటే... బుధవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణం చేయబోతున్నారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం ఉంటుంది.

    "అమెరికాలో భారతీయులు ఏళ్లుగా ఆ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఎన్నో రంగాల్లో వారు రాణిస్తున్నారు. వారికి తగిన గుర్తింపు ఇప్పుడు కొత్త ప్రభుత్వ హయాంలో లభించబోతోంది. ముఖ్యంగా మహిళలకు ఇంతలా గుర్తింపు ఇవ్వడం గొప్ప విషయం." అని ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు రంగస్వామి తెలిపారు.



    2020 ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర  దినోత్సవం (Independence Day) నాడు జో బిడెన్... ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీతో వర్చువల్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అప్పుడే తాము గెలిస్తే తగిన గుర్తింపు ఇస్తామని మాట ఇచ్చారు. నిలబెట్టుకున్నారు.

    ఇప్పుడే కాదు... ట్రంప్‌కి ముందు... ఒబామా అధ్యక్షుడిగా, బిడెన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగినప్పుడు కూడా... భారతీయ అమెరికన్లు... ఆ ప్రభుత్వానికి అండగా నిలిచారు. చాలా మంది కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. అందువల్లే ఒబామా వారసుడిగా... బిడెన్ కూడా భారతీయ-అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

    20 మంది భారతీయ-అమెరికన్ల జాబితా:
    Neera Tanden: నీరా టాండన్ వైట్‌హౌస్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ ఆఫీస్ కి డైరెక్టర్‌గా నామినేట్ అయ్యారు.
    Dr Vivek Murthy: అమెరికా సర్జన్ జనరల్‌కి డాక్టర్ వివేక్ మూర్తి నామినేట్ అయ్యారు.
    Vanita Gupta: న్యాయ విభాగానికి అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నామినేట్ అయ్యారు.
    Uzra Zeya: పౌర భద్రత, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల శాఖకు నామినేట్ అయ్యారు.
    Mala Adiga: ఫ్యూచర్ ఫస్ట్ లేడీ డాక్టర్ జిల్ బిడెన్‌ (బిడెన్ భార్య)కి పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగా నియమితులయ్యారు.
    Garima Verma: జిల్ బిడెన్‌కి డిజిటల్ డైరెక్టర్‌గా గరిమా వర్మ నామినేట్ అయ్యారు.
    Sabrina Singh: జిల్ బిడెన్‌కి డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీగా సబ్రినా సింగ్ నామినేట్ అయ్యారు.
    Aisha Shah: వైట్ హౌస్ ఆఫీస్ డిజిటల్ స్ట్రాటజీలో పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా ఐషా షా నియమితులయ్యారు.
    Sameera Fazili: వైట్‌హౌస్‌లోని అమెరికా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్‌లో డిప్యూటీ డైరెక్టర్ పదవికి సమీరా ఫాజిలీ నియమితులయ్యారు.
    Bharat Ramamurti: వైట్ హౌస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా భరత్ రామమూర్తి నామినేట్ అయ్యారు.
    Gautam Raghavan: అధ్యక్షుడి పర్సనల్ ఆఫీస్‌కి డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్ నియమితులయ్యారు.
    Vinay Reddy: స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా వినయ్ రెడ్డి నియమితులయ్యారు.
    Vedant Patel: అధ్యక్షుడికి అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీగా వేదాంత్ పటేల్ నామినేట్ అయ్యారు.
    Sonia Aggarwal: క్లైమేట్ పాలసీకి సీనియర్ సలహాదారుగా సోనియా అగర్వాల్ నియమితులయ్యారు. అమె వైట్ హౌస్ లోని జాతీయ వాతావరణ పాలసీ ఆఫీసులో ఇన్నోవేషన్ విభాగం కూడా చూసుకుంటారు.
    Vidur Sharma: వైట్ హౌస్ కోవిడ్ 19 రెస్పాన్స్ టీమ్‌ టెస్టింగ్‌కి పాలసీ సలహాదారుగా విదూర్ శర్మ నియమితులయ్యారు.

    ఇది కూడా చదవండి:Narrow mind Zodiac signs: ఈ 5 రాశుల వారిదీ సంకుచిత మనస్తత్వం

    వీరితో పాటూ... వైట్‌హౌస్‌లని కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌కి ముగ్గురు భారతీయ-అమెరికన్లు... తరుణ్ చాబ్రా, సుమోనా గుహ, శాంతి కళాతిల్ నియమితులయ్యారు. వీరు ఆ దేశ విదేశీ విధానం, జాతీయ భద్రత విషయంలో కీలకంగా వ్యవహరిస్తారు. వైట్‌హౌస్ కౌన్సిల్‌లో డిప్యూటీ అసోసియేట్ కౌన్సిల్‌ కింద ఇద్దరు భారతీయ-అమెరికన్లు...నేహా గుప్త, రీమా షా... నియమితులయ్యారు.
    Published by:Krishna Kumar N
    First published:January 18, 2021, 11:15 IST