HOME »NEWS »INTERNATIONAL »joe biden nominates 20 indian americans in his team three days before of his oath taking hsn

Joe Biden: మరో మూడ్రోజుల్లో ప్రమాణస్వీకారమనగా.. జో బైడెన్ కీలక నిర్ణయం..!

Joe Biden: మరో మూడ్రోజుల్లో ప్రమాణస్వీకారమనగా.. జో బైడెన్ కీలక నిర్ణయం..!
జో బైడెన్ (ఫైల్ ఫొటో)

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణస్వీకారానికి ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరవబోతున్నారు. జో బైడెన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరుకాబోనని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతల బదలాయింపు ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తానని గతంలోనే స్పష్టం చేశారు.

  • Share this:
    మరో మూడ్రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జో బైడెన్, తన పరిపాలన సిబ్బంది విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరికొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకుని తీవ్ర సమస్యల్లో ఉన్న అమెరికాను త్వరితగతిన గట్టెక్కించాలన్న పంతంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారత సంతతికి చెందిన 20 మందిని తన టీమ్ లోకి తీసుకోవడం అగ్రరాజ్యంలో చర్చనీయాంశంగా మారింది. జనవరి 20న అమెరికా అధినేతగా పగ్గాలు చేపట్టబోతుండగా, భారత సంతతికి చెందిన వారికి పెద్దపీట వేయడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, అమెరికాలోని భారతీయ సమాజానికి కీలక పదవులను, బాధ్యతలను ఇస్తుందంటూ చెప్పుకొస్తున్నారు.

    జో బైడెన్ నామినేట్ తన టీమ్ లోకి తీసుకున్న 20 మంది భారత సంతతి నేతల్లో 13 మంది మహిళలే. ఆ 20 మందిలో 17 మంది వైట్ హౌస్ లోనే కీలక పోస్టులకు ఎంపికయ్యారు. అసోసియేట్ అటార్నీ జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ గా వనితా గుప్తా, స్టేట్ ఫర్ సివిలియన్ సెక్యూరిటీ, డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ సెక్రటరీగా ఉజ్రా జెయా నియామకమయ్యారు. అదే సమయంలో మలా అడిగా, గరిమా వెర్మా, సబ్రినా సింగ్, గౌతమ్ రాఘవన్ వంటి ముఖ్యమైన భారత సంతతి వ్యక్తులకు జో బైడెన్ టీమ్ లో చోటు దక్కింది. కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కమలా హారిస్ కూడా భారతీయ మూలాలు కలిగిన నేతే కావడం గమనార్హం. అదే సమయంలో అమెరికాకు మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు చేపట్టబోతోంది కూడా కమలా హారిసే అవ్వడం విశేషం.



    ఇదిలా ఉండగా, జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణస్వీకారానికి ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరవబోతున్నారు. జో బైడెన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరుకాబోనని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతల బదలాయింపు ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తానని గతంలోనే స్పష్టం చేశారు. క్యాపిటల్ భవన్ పై జరిగిన దాడి తర్వాత ట్రంప్ ఇంటా బయటా అప్రతిష్టను మూటకట్టుకున్నారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్లు కూడా నిషేధానికి గురయ్యాయి. ఈస్థాయిలో అప్రతిష్టను మూటకట్టుకున్న అమెరికా అధ్యక్షుడు గతంలో ఎవరూ లేరని అగ్రరాజ్య పౌరులు చెప్పుకుంటున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:January 17, 2021, 14:53 IST