Joe Biden: కొత్త చరిత్ర సృష్టిస్తున్న జో బిడెన్... అందరూ ఆశ్చర్యపోయేలా సంచలన నిర్ణయం

Joe Biden: కొత్త చరిత్ర సృష్టిస్తున్న జో బిడెన్... అందరూ ఆశ్చర్యపోయేలా సంచలన నిర్ణయం

కొత్త చరిత్ర సృష్టిస్తున్న జో బిడెన్ (credit - twitter - joe biden)

Joe Biden Team: జో బిడెన్ మెతక మనిషి అనీ... అమెరికా అధ్యక్షుడిగా ఆయన పనికిరారు అని ట్రంప్ ఎన్నో అన్నారు. కానీ అదే జో బిడెన్ అందరూ మెచ్చుకునేలా నిర్ణయాలు తీసుకుంటూ ట్రంప్‌కి షాక్ ఇస్తున్నారు.

  • Share this:
    Joe Biden: జనవరి 20న జో బిడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా... ఆయన తన టీమ్‌ని రెడీ చేసుకుంటున్నారు. అందులో భాగంగా... తాజాగా... సీనియర్ వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ టీమ్‌ని ఆదివారం ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే... ఆ టీమ్‌లో మొత్తం మహిళలనే నియమించారు. అమెరికా చరిత్రలో ఇదివరకు ఎప్పుడూ, ఏ అధ్యక్షుడూ ఇలా మొత్తం మహళలను నియమించలేదు. తద్వారా జో బిడెన్ కొత్త చరిత్ర సృష్టించినట్లైంది. ఈ టీమ్‌లో జెన్ సాకీ (Jen Psaki)... వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీగా కీలక పాత్ర పోషించబోతున్నారు. 41 ఏళ్ల సాకి... ఇప్పటికే చాలా సీనియర్ పదవులు నిర్వహించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా, జో బిడెన్ ఉపాధ్యక్షుడిగా చేసిన టైమ్‌లో ఆమె... వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు.

    ఇప్పటివరకు అధ్యక్షుడిగా జో బిడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్... ఇద్దరూ... ముందుగా చేపడుతున్న నియామకాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. "మొదటి సీనియర్ వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ టీమ్‌లో అందరూ మహిళలే ఉండటాన్ని నేను గర్వంగా ప్రకటిస్తున్నాను" అని జో బిడెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. "అర్హత ఉన్న, అనుభవం ఉన్న ఈ కమ్యూనికేటర్స్... తమ వృత్తిలో వైవిధ్యాన్ని చూపిస్తారు. ఈ దేశాన్ని తిరిగి ఉన్నత స్థితిలో నిలబెట్టేందుకు నిబద్ధతతో పనిచేస్తారు" అని ఆయన తెలిపారు.


    సాకీతోపాటూ... మరో ఆరుగురిని జో బిడెన్ నియమించారు. వారిలో కేట్ బెడింగ్ ఫీల్డ్ (ఈమె జో బిడెన్ డిప్యూటీ క్యాంపెయిన్ మేనేజర్) ఇప్పుడు వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కాబోతున్నారు. ఐతే... ఈమె... ఇదివరకు బడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా సేవలందించారు.

    ఇది కూడా చదవండి: PM Kisan: రైతుల ఖాతాల్లో కేంద్రం రూ.2000 జమ... మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

    ఇక మరో మహళా అధికారి అష్లీ ఇటిన్నేను... కమలా హ్యారిస్... కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా ప్రకటించారు. అలాగే... సైమన్ సాండర్స్‌ను కమలా హ్యారిస్ సీనియర్ సలహాదారు, ప్రధాన ప్రతినిధి (spokeswoman)గా ప్రకటించారు. అలాగే... పిలి టోబర్‌ను డిప్యూటీ వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా, కారినే జీన్ పియర్రీని... ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీగా ప్రకటించారు. ఇక ఎలిజబెత్ అలెగ్జాండర్‌ను అమెరికా కాబోయే ప్రథమ మహిళ, బిడెన్ భార్య జిల్ బిడెన్‌కి కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా నియమించబోతున్నారు. ఐతే... చాలా కేబినెట్ లెవెల్ పదవులకు అవసరమైనట్లు... ఈ పదవులకు సెనెట్ అనుమతి అవసరం లేదు. అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తానికి అందరూ మహిళల్ని నియమించడం ద్వారా... మహిళలకు తమ ప్రభుత్వంలో అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని జో బిడెన్ చెప్పినట్లైంది.
    Published by:Krishna Kumar N
    First published: