HOME »NEWS »INTERNATIONAL »joe biden and kamala harris will sworn tomorrow check schedule and where to watch sk gh

Inauguration Day 2021: నేడే బైడెన్, కమల ప్రమాణస్వీకారం.. లైవ్ ఇలా చూడండి..

Inauguration Day 2021: నేడే బైడెన్, కమల ప్రమాణస్వీకారం.. లైవ్ ఇలా చూడండి..
జో బైడెన్, కమలా హారిస్

Inauguration Day 2021: జో బైడెన్, కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రముఖ ఎంటర్టైనర్ కేకే పామర్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం జనవరి 20 బుధవారం రాత్రి 10.00 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది.

  • Share this:
అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఇవాళ అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ అధ్యక్షుడిగా బైడెన్, 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ (Kamala Harris) పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సంతతికి చెందిన కమలా అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనం ముట్టడి తర్వాత జరుగుతున్న ఈ ప్రమాణస్వీకారోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు.

ప్రమాణాస్వీకారోత్సవం టైమింగ్ షెడ్యూల్:


ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఎంటర్టైనర్ కేకే పామర్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం జనవరి 20 బుధవారం రాత్రి 10.00 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అమెరికా జాతీయగీతంలో ఆరంభమవుతుంది. యూఎస్ఏ ప్రథమ మహిళ జిల్ బైడెన్ ప్రజలనుద్దేశించి మొదటగా లైవ్ స్ట్రీమ్ లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నానికి ముందు కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్.. బైడెన్ ను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. తర్వాత శాంతియుతంగా అధికారాన్ని బదిలీ చేయడాన్ని సూచించడానికి బైడెన్, కమలా హ్యారిస్ పాస్ ఇన్ రివ్యూ తనిఖీని పూర్తి చేస్తారు.

ప్రమాణస్వీకారోత్సవాన్ని ఎక్కడ చూడవచ్చంటే..
యూఎస్ఏలోని అన్ని ప్రధాన టీవీ నెట్వర్క్స్‌లో జో బైడైన్ అధ్యక్ష పదవీ ప్రమాణాస్వీకరాన్ని  వీక్షించవచ్చు. సీఎన్ఎన్, ఎంఎస్ఎన్బీసీ, ఏబీసీ, సీబీఎస్, పీబీఎస్, ఎన్బీసీ లాంటి టీవీ ఛానెళ్లు ఉన్నాయి. కార్యక్రమాన్ని లైవ్లో అమేజాన్ ప్రైమ్ వీడియో, మైక్రోసాఫ్ట్ బింగ్, ఫాక్స్ నుంచి న్యూస్ నౌ (SD / HD లో ఛానల్ 212/1212) మరియు AT&T DIRECTV (ఛానల్ 201) వంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా చూడవచ్చు. అంతేకాకుండా బైడెన్ ఇనాగరల్ కమిటీ సోషల్ మీడియా ఛానెళ్లతో పాటు కూడా bideninaugural.org/watch/ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:January 20, 2021, 06:14 IST