TIME's 2020 Person of the Year: టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా జో బైడెన్, కమలా హారిస్

TIME's 2020 Person of the Year: టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా జో బైడెన్, కమలా హారిస్

జో బైడెన్, కమలా హారిస్

నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన 306 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించగా.. డొనాల్డ్ ట్రంప్ 232 ఓట్లు మాత్రమే సాధించారు.

  • Share this:
    అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ (78), కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌(56)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మేగజైన్ టైమ్.. వీరిద్దరిని 2020 పర్సన్ ఆఫ్ ఇది ఇయర్‌గా ప్రకటించింది. మేగజైన్ కవర్ పేజీపై బైడెన్, కమలా ఫొటోలను ముద్రించి Changing america's story అని సబ్ టైటిల్ ఇచ్చారు. వీరితో పాటు కరోనా యోధులు మరియు ఆంటోని ఫాసి, జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం, డొనాల్డ్ ట్రంప్ ఫైనల్‌లో ఉన్నారు. చివరి బైడెన్, కమలా హారిస్‌లు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.


    నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన 306 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించగా.. డొనాల్డ్ ట్రంప్ 232 ఓట్లు మాత్రమే సాధించారు. జో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270 కంటే 36 ఎలక్ట్రోరల్ ఓట్లు ఎక్కువగా సాధించారు.

    కాగా, వార్తల్లో ఎక్కువగా నిలిచిన వ్యక్తులను టైమ్ మేగైజన్ 1927 నుంచి ప్రతి ఏటా సత్కరిస్తూ వస్తోంది. కాగా, వాతావరణ మార్పులపై పోరాడుతున్న టీనేజీ యాక్టివిస్ట్ గ్రెటా తన్‌బర్గ్‌ను గత ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా టైమ్ ప్రకటించింది. 2016లో ట్రంప్.. పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. మరోవైపు బాస్కెట్ బాల్ సూపర్ స్టార్ లిబ్రాన్ జేమ్స్‌ను అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌ 2020గా ప్రకటించింది టైమ్స్. ఇక కొరియన్ పాప్ సన్సేషన్ BTSని ఎంటైర్‌టైనర్‌ ఆఫ్ ది ఇయర్‌ 2020 గా ఎంపిక చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published: