news18-telugu
Updated: November 7, 2020, 10:59 PM IST
జో బైడెన్, కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు దాదాపు తేలిపోయాయి. రిపబ్లికన్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన జో బైడెన్ అధ్యక్షుడు, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జో బైడెన్‌కు 20 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన మెజారిటీ 270 ఎలక్టోరల్ ఓట్లను దాటి 273 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు తెలిసిన వెంటనే జో బైడెన్ స్పందించారు. అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అమెరికా. గ్రేట్ కంట్రీకి లీడర్‌గా ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు. మనముందున్న పని కష్టమైందే. కానీ, నేను ఒక్కటి మాత్ర ప్రమాణం చేస్తున్నా. నేను అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిని. మీరు నాకు ఓటు వేసినా. వేయకపోయినా. మీరు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.’ అని బైడెన్ ఓ వీడియోను ట్వీట్ చేశారు.
జో బైడెన్ అధ్యక్షుడు కావడంతో ఇక కమలా హారిస్ కూడా వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. భారతీయ మూలాలున్న కమలా హారిస్ అమెరికాకు 49వ ఉపాధక్షురాలిగా ఎన్నిక కావడం లాంఛనమే. అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపు ఖాయమైన తర్వాత కమలాహారిస్ స్పందించారు. ‘ఈ ఎన్నికలు కేవలం జో బైడెన్, నా గురించి కాదు. ఇది అమెరికా అత్మ గురించి. దీని కోసం ఫైట్ చేస్తాం. మా ముందు చాలా పని ఉంది. ప్రారంభిద్దాం.’ అంటూ ట్వీట్ చేశారు.
జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా, కమలా హారిస్ అమెరికా 48వ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వారిద్దరికీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా అమెరికన్లు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. అయితే, టీవీ చానళ్లు ప్రకటించిన నెంబర్లను చూసి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి జో బైడెన్ ఆరాటపడుతున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆయన ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్‌పై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 7, 2020, 10:51 PM IST