HOME »NEWS »INTERNATIONAL »joe biden and kamala devi harris inauguration function on january 20 invitation card goes viral ba

Joe Biden-Kamala Harris: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణస్వీకార ఆహ్వాన పత్రిక వైరల్..

Joe Biden-Kamala Harris: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణస్వీకార ఆహ్వాన పత్రిక వైరల్..
జో బైడెన్, కమలా హారిస్

అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణస్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. జనవరి 20వ తేదీన వారు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వాన కమిటీ ఇన్విటేషన్ కార్డులను పంపుతోంది.

  • Share this:
    అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణస్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. జనవరి 20వ తేదీన వారు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వాన కమిటీ ఇన్విటేషన్ కార్డులను పంపుతోంది. ఈ ఆహ్వానపత్రికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా అధ్యక్ష పీఠం దిగనని మారాం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ను సాగనంపేందుకు ఇప్పటికే అభిశంసన తీర్మానాన్ని ఆమోదించారు. అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రతినిధుల సభ ఆమోదించింది. ట్రంప్‌నకు వ్యతిరేకంగా 231 ఓట్లు.. అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి.. అంతేకాదు పలువురు రిపబ్లికన్లు కూడా వ్యతిరేకంగా ఓటు వేశారు. అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలిచారు.

    జనవరి 20న జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గగా, ప్రఖ్యాత సింగర్ జెన్నీఫర్ లోఫెజ్, అమెరికన్ కవయత్రి అమండా గోర్మాన్ ప్రదర్శన ఇవ్వనున్నట్టు ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురేషన్ కమిటీ గురువారం ప్రకటించింది.



    జో బైడెన్ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయి. అతి సాధారణ జీవితం నుంచి అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. నెల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. 1969లో న్యాయవాది అయ్యాడు. ఆ తర్వాత ఒక్క ఏడాదికే న్యూ కాజిల్ కౌంటీ కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. 1972లో సెనేటర్ గా గెలిచారు. ఆయన సెనేటర్ గా గెలిచిన కొద్ది నెలల్లోనే భార్య, ఓ ఏడాది వయసున్న కూతురు ఓ ప్రమాదంలో మరణించారు. ఆ బాధ నుంచి తట్టుకునేందుకు పూర్తిగా పదవీ బాధ్యతలపైనే బైడెన్ దృష్టి సారించారు. మొదటి భార్య మరణించిన ఐదేళ్ల తర్వాత జిల్ నురెండో పెళ్లి చేసుకున్నారు. 1972 నుంచి ఇప్పటి వరకు ఆయనది పూర్తిగా రాజకీయ జీవితమే. ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అనేక కీలక పదవులను చేపట్టారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించారు.



    జనవరి 20న జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గగా, ప్రఖ్యాత సింగర్ జెన్నీఫర్ లోఫెజ్, అమెరికన్ కవయత్రి అమండా గోర్మాన్ ప్రదర్శన ఇవ్వనున్నట్టు ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురేషన్ కమిటీ గురువారం ప్రకటించింది.

    గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మీద జో బైడెన్ గెలుపొందారు. అయితే, తాను దిగనని ట్రంప్ మొండికేశారు. ఆ తర్వాత ఆయన అభిశంసన ఎదుర్కొన్నారు. 77 ఏళ్ల జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే, భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికాకు 49వ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికాకు ఆమె మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు, మొదటి ఇండియన్ అమెరికన్ ఉపాధ్యక్షురాలు, మొదటి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలు, మొదటి దక్షిణ ఆసియా అమెరికన్ మహిళా ఉపాధ్యక్షురాలు కాబోతున్నారు. కమలాహారిస్ తల్లి భారతీయురాలు, తండ్రి జమైకన్.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 15, 2021, 22:47 IST

    टॉप स्टोरीज