Home /News /international /

JIO PLATFORMS LTD AND SES ANNOUNCE JOINT VENTURE TO DELIVER HIGH PERFORMANCE SATELLITE BASED BROADBAND SERVICES ACROSS INDIA GH VB

JPL- SES Joint Venture: రిలయన్స్ జియో కొత్త ఒప్పందం.. లక్సెంబర్గ్‌కు చెందిన SES కంపెనీతో శాటిలైట్ జాయింట్ వెంచర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ గ్లోబల్ శాటిలైట్ బేస్డ్ కంటెంట్ కనెక్టివిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ SESతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ (Jio Platforms Ltd). రెండు సంస్థలు కలిసి ‘జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్‌’ పేరుతో జ?

ఇంకా చదవండి ...
ప్రముఖ గ్లోబల్ శాటిలైట్ బేస్డ్ కంటెంట్ కనెక్టివిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ SESతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ (Jio Platforms Ltd). రెండు సంస్థలు కలిసి ‘జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్‌’ (Jio Space Technology Ltd) పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. SES లక్సెంబర్గ్‌కు చెందిన నెట్‌వర్క్ కమ్యూనికేషన్ కంపెనీ(Network Communication Company). శాటిలైట్ టెక్నాలజీ సాయంతో భారతదేశంలో నెక్స్ట్ జనరేషన్ స్కేలబుల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను తక్కువ ధరకు అందించడానికి ఈ ఒప్పదం చేసుకున్నట్లు రెండు కంపెనీలు వెల్లడించాయి.

ఈ జాయింట్ వెంచర్‌లో JPL, SES కంపెనీల వాటా 51%, 49% ఈక్విటీ స్టేక్స్‌గా ఉంటుంది. ఒప్పందం కింద మల్టీ ఆర్బిట్ స్పేస్ నెట్‌వర్క్‌ను కంపెనీలు ఉపయోగించుకోనున్నాయి. ఇందులో జియోస్టేషనరీ (GEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO) శాటిలైట్ కంస్టెల్లేషన్స్ కలిసి ఉంటాయి. భారతదేశంతో పాటు పొరుగు దేశాల్లో ఉన్న ఎంటర్‌ప్రైజెస్, మొబైల్ బ్యాక్‌హాల్, రిటైల్ కస్టమర్‌లకు మల్టీ-గిగాబిట్ లింక్‌లు, సామర్థ్యాన్ని అందించగల సామర్థ్యం వీటికి ఉంది.

ఈ ఒప్పందంపై జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ఫైబర్ బేస్డ్ కనెక్టివిటీ, FTTH వ్యాపారాన్ని విస్తరించడం, 5G పెట్టుబడుల కొనసాగింపులో భాగంగా ఈ జాయింట్ వెంచర్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ‘SESతో ఈ కొత్త జాయింట్ వెంచర్ మల్టీ-గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్ వృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించే అదనపు కవరేజ్, సామర్థ్యంతో మారుమూల పట్టణాలు, గ్రామాలు, సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వినియోగదారులను మా జియో సంస్థ కొత్త డిజిటల్ ఇండియాకు కనెక్ట్ చేయగలదు’ అని ఆకాష్ అంబానీ వెల్లడించారు.

ISRO PSLV-C52: రాకెట్ రయ్ రయ్.. కక్ష్యలోకి 3ఉపగ్రహాలు -2022లో తొలి ప్రయోగం విజయవంతం


SES కంపెనీ CEO స్టీవ్ కాలర్ మాట్లాడుతూ, ‘హై క్వాలిటీ కనెక్టివిటీని అందించడానికి, కోట్ల మంది ప్రజలకు సేవలందించడానికి SES విస్తృతమైన టెరెస్ట్రియల్ నెట్‌వర్క్స్ డెవలప్ చేసింది. ఇదే సామర్థ్యంతో JPLతో జాయింట్ వెంచర్ నెలకొల్పుతున్నాం. దీని ద్వారా భారతదేశంలో డిజిటల్ ఇన్‌క్లూజన్‌ను ప్రోత్సహించడానికి మావంతు కృషి చేస్తాం.’ అని పేర్కొన్నారు.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొత్తగా ఏర్పాటు చేసిన శాటిలైట్ యూనిట్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Jio Satellite Communications Ltd- JSCL) అభివృద్ధిపై కంపెనీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తాజా JPL-SES జాయింట్ వెంచర్ ఒప్పందంపై రిలయన్స్ ఆసక్తి చూపింది. శాటిలైట్ సేవల ద్వారా గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ (GMPCS) సేవలందించేందుకు లైసెన్స్ కోసం JSCL ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) దరఖాస్తు చేసుకుంది. భారతి ఎయిర్‌టెల్ తర్వాత ఇండియన్ శాటిలైట్ కమ్యూనిటీ విభాగంలో నెట్‌వర్క్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన రెండో సంస్థగా ఈ కంపెనీ నిలిచింది.

భారతదేశంలో SES శాటిలైట్ డేటా, కనెక్టివిటీ సేవలను JPL-SES జాయింట్ వెంచర్ ఉపయోగించుకోనుంది. SES ద్వారా సేవలందించే నిర్దిష్ట అంతర్జాతీయ ఏరోనాటికల్, మారిటైమ్ కస్టమర్లకు మినహా మిగతా జోన్లకు ఈ సేవలను కొత్త పార్ట్నర్ సంస్థ అందించనుంది.

LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీవో.. పాలసీదారులు, ఉద్యోగులు, ఏజెంట్లకు అదిరిపోయే డిస్కౌంట్.. వివరాలివే


SES సామర్థ్యం గరిష్టంగా 100 Gbps వరకు ఉంటుంది. ఈ రంగంలో మార్కెట్ డెవలప్‌మెంట్ అవకాశాలు పొందడానికి, భారతదేశంలో Jio ప్రీమియర్ స్థానం, సేల్స్ రీచ్‌ను పొందడానికి రిలయన్స్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ జాయింట్ వెంచర్ దేశంలో గేట్‌వే ఇన్‌ఫ్రాస్టక్చర్ అభివృద్ధి దృష్టి సారిస్తుంది. జాయింట్ వెంచర్ యాంకర్ కస్టమర్‌గా ఉన్న Jio.. కొన్ని మైలురాళ్ల ఆధారంగా గేట్‌వేస్, ఇతర ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లు చేపట్టనుంది. ఈ మొత్తం కాంట్రాక్ట్ విలువ 100 మిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. ఈ మల్టీ ఈయర్ కెపాసిటీ పర్చేజ్ అగ్రిమెంట్‌తో కనెక్టివిటీ నెట్‌వర్క్‌లో స్థానాన్ని పదిలం చేసుకోవాలని జియో భావిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: Network, Reliance, RIL

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు