నగ్న ఫొటోల లీకేజీ వివాదంలో ప్రపంచ కుబేరుడు

Jeff Bezos : అమెజాన్ ఈ-కామర్స్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లను సంపాదించుకున్న జెఫ్ బెజోస్... తన గర్ల్ ఫ్రెండ్‌ విషయంలో మాత్రం కోర్టు కేసుతో చిక్కుల్లో పడుతున్నారు.


Updated: February 2, 2020, 11:32 AM IST
నగ్న ఫొటోల లీకేజీ వివాదంలో ప్రపంచ కుబేరుడు
లారెన్, జెఫ్ బెజోస్
  • Share this:
ప్రపంచ అపర సంపన్నుడు, అమెజాన్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ సోదరుడు మైకెల్ శాంచెజ్... జెఫ్ బెజోస్‌పై పరువునష్టం దావా వేశాడు. తన సోదరికి చెందిన నగ్న ఫొటోల లీకేజీ వెనక జెఫ్ బెజోస్ హస్తం ఉందని ఆయన ఆరోపించాడు. ఇందుకు సంబంధించి ది నేషనల్ ఎంక్వైరెర్ సంస్థకు... ఆయన కొన్ని ఫొటోలను ఆధారాలుగా చూపించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి... లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఈ దావా వేశాడు. ఈ కేసుతో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. జెఫ్ బెజోస్ ఫోన్‌ హ్యాకింగ్‌లో సౌదీ అరేబియా రాజు హస్తం ఉందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు జరుపుతున్నారు. ఐతే... బెజోస్ తరపున పనిచేస్తున్న సెక్యూరిటీ కన్సల్టెంట్ గావిన్ డి బెకెర్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. మైకెల్ శాంచెజ్... ఆధారాలుగా సమర్పించిన ఫొటోల్లో ఉన్నది జెఫ్ బెజోస్ కాదనీ... అవి గ్రాఫిక్ న్యూడ్ ఫొటోలు అని ఆయన అంటున్నారు.

దీనిపై త్వరలోనే బెజోస్ కోర్టుకు వివరణ ఇస్తారని ఆయన తరపు లాయర్ విలియం ఇసాక్సన్ తెలిపారు. ఈ విషయంపై లారెన్ శాంచెజ్ స్పందించింది. తన వ్యక్తిగత సమాచారాన్ని... తన సోదరుడు రహస్యంగా... ది నేషనల్ ఎంక్వైరెర్ సంస్థకు ఇచ్చాడనీ... ఇది ఎప్పటికీ క్షమించరాని నేరం అని ఆమె ఫైర్ అయ్యింది. ఈ ఆధార రహిత దావాపై తన ఫ్యామిలీ తీవ్ర ఆవేదన చెందుతోందన్న ఆమె... తన సోదరుడు శాంతిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపింది.

First published: February 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు