JEFF BEZOS EX WIFE BILLIONAIRE MACKENZIE SCOTT HAS MARRIED A SCIENCE TEACHER SRD
Jeff Bezos : మెకాంజీ స్కాట్ రెండో వివాహం..మాజీ భర్త, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ స్పందన ఏంటంటే..
Photo Credit : Instagram
Jeff Bezos : ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్లోని సీటెల్కు చెందిన సైన్స్ టీచర్ డాన్ జీవెట్ను ఆమె వివాహమాడారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్లోని సీటెల్కు చెందిన సైన్స్ టీచర్ డాన్ జీవెట్ను ఆమె వివాహమాడారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అదే విధంగా జెవెట్ సైతం మెకాంజీకి సంబంధించిన వెబ్సైట్(ప్లెడ్జ్ పేజీ) ద్వారా ధ్రువీకరించారు.ఈ మేరకు.. "అత్యంత దయనీయురాలు, కరుణామూర్తి అయిన మహిళను నేను పెళ్లి చేసుకున్నాను. అంతేకాదు, సంపద దానం చేసే విషయంలో తను ఎంతో నిబద్ధతగా నెరవేరుస్తున్న బాధ్యతల్లో భాగం కాబోతున్నాను" అంటూ తాను ఆనందడోలికల్లో తేలుతున్నట్లు తెలిపారు. జెవెట్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు మెకాంజీ రెండో వివాహంపై స్పందించిన జెఫ్ బెజోస్.. " డాన్ చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. వాళ్లిద్దరు తీసుకున్న నిర్ణయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది" అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇక 25 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ బెజోస్- మెకాంజీ 2019లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామన్న బెజోస్.. ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్ అమెజాన్ షేర్లను జెఫ్ బెజోస్, మెకాంజీ పేరిట బదలాయించినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రపంచంలోని సంపన్న మహిళల్లో ఒకరిగా ఆమె నిలిచారు.
అయితే, 50 ఏళ్ల మెకాంజీ, సామాజిక సేవలో భాగంగా గతేడాది 6 బిలియన్ డాలర్ల సంపదను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భర్త డాన్ జెవెట్ కూడా ఇకపై ఆమెకు తోడుగా నిలవనున్నారు. కాగా బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం మెకాంజీ ప్రస్తుత సందప 53.5 బిలియన్ డాలర్లు.