Princess Mako Marriage : రాచ‌రికం.. రాజాభ‌రణం ఏదీ వ‌ద్దు.. మ‌న‌సైన‌వాడు చాలు : సామాన్యుడిని పెళ్లి చేసుకొన్న జ‌పాన్ రాకుమారి మ‌కో

జ‌పాన్ రాకుమారి మ‌కో

Princess Mako Marriage: ఎన్నో వ‌స‌తుల రాజ‌ప్ర‌సాదం.. లోటు లేని జీవితం.. అంబ‌రాన్నంటే వైభోగాలు ఇవే క‌దా అంద‌రూ కోరుకొనేవి అని అనుకుంటాం..కానీ జ‌పాన్ రాకుమారి (Japan Princess)  వీట‌న్నింటినీ కాద‌ని సామ‌న్యుడిని పెళ్లి చేసుకొని రాజ‌ప్ర‌సాదాన్ని వీడింది.

 • Share this:
  ఎన్నో వ‌స‌తుల రాజ‌ప్ర‌సాదం.. లోటు లేని జీవితం.. అంబ‌రాన్నంటే వైభోగాలు ఇవే క‌దా అంద‌రూ కోరుకొనేవి అని అనుకుంటాం..కానీ జ‌పాన్ రాకుమారి (Japan Princess)  వీట‌న్నింటినీ కాద‌ని సామ‌న్యుడిని పెళ్లి చేసుకొని రాజ‌ప్ర‌సాదాన్ని వీడింది. త‌న‌కు వీట‌న్నింటిక‌న్నా మ‌న‌సైన‌వాడే ముఖ్యం అని ఎటువంటి ఆడంబ‌రాలు లేకుండా పెళ్లి చేసుకొంది జ‌పాన్ రాకుమారి మ‌కో(Japan Princess Mako).. అంతే కాదు సాంప్ర‌దాయంగా వ‌చ్చే రాజాభ‌ర‌ణాన్ని తృణప్రాయం గా వదులుకుని సామాన్యు డి ఇం ట కోడలిగా అడుగుపెట్టింది. ఇది సినిమా క‌థ‌ను త‌ల‌పించే ఈమే ప్రేమ‌క‌థ చివ‌ర‌కు ఆమె కోరుకున్న‌ట్టుగా సుఖాంత‌మైంది. ఎన్నో భావోద్వేగాలు.. స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి ఈ ప్రేమ జంట ఒక్క‌ట‌య్యారు. ఇప్పుడు ఇదే జ‌పాన్‌లో హ‌ట్ న్యూస్‌.

  ఏమిటీ వీరి ప్రేమ క‌థ‌..
  జపాన్‌ చక్రవర్తి నరుహిటో తమ్ము డు అకిషినో కుమార్తె మకో. ఈమె టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీ (Christian University) లో విద్య‌న‌భ్య‌సించింది. అక్క డే తనతో పాటు చదువుకునే కొమురోను ఇష్టపడ్డారు. అత‌ను సామ‌న్య కుటుంబం నుంచి వ‌చ్చాడు. వీరిద్ద‌రు 2017లోనే తాము పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

  Saudi Crown : నాటి రాజును విష‌పు ఉంగ‌రంతో చంపాల‌నుకొన్నారు.. సౌదీ రాజుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌


  అయితే అదే స‌మ‌యంలో ప్రేమికుడి త‌ల్లి కార‌ణంగా ఆర్థిక వివాదాలు త‌లెత్తాయి. దీంతో వీరి పెళ్లి ర‌ద్దు అయ్యింది. అనంత‌రం 2018లో ప్రేమికుడి కొమురో న్యూయార్క్ (New York) వెళ్లాడు. అక్క‌డ లా చ‌దువు పూర్తి చేశాడు. లా చ‌ద‌వివేందుకు మూడేళ్ల‌పాటు అత‌ను జ‌పాన్ వైపు రాలేదు కూడా. దీంతో రాకుమారి మ‌కో రాణివాసంలో ఉండిపోయారు..

  ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో కొమురో లా చ‌దువు పూర్తి చేసుకొని జపాన్ తిరిగి వ‌చ్చాడు. అనంత‌రం వీరిద్ద‌రు త‌మ ప్రేమ పెళ్లిని పెద్ద‌ల ముందుకు తీసుకు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలోనే కొమురో ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై స్ప‌ష్ట‌త‌నివ్వాల‌ని రాజ‌కుటుంబీకులు కోరారు. దీనిపై అత‌ను లిఖిత‌పూర్వ‌క హామీ ఇచ్చారు. దీంతో పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించారు. గ‌తంలో జ‌రిగిగిన వివాదాల కార‌ణంగా ఈ సారి రాజ‌కుటుంబం వీరి పెళ్లిని సాధార‌ణంగా నిర్వ‌హించింది. ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో ఈ పెళ్లిప‌ట్ల వ్య‌తిరేఖ‌త నెల‌కొంది. దీంతో పెళ్లిని సాంప్ర‌దాయ బ‌ద్ద‌గా కాకుండా వివాహ బంధంతో క‌లిసామ‌ని అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు.

  రాజ‌భ‌ర‌ణం తిర‌స్క‌ర‌ణ‌..
  జ‌పాన్ (Japan) రాజ‌కుటుంబంలో ప్ర‌త్యేక నిబంధ‌న‌లు ఉంటాయి. రాజ‌కుటుంబీకులు ఎవ‌రైన బ‌య‌టి వారిని వివాహం చేసుకొంటే రాచ‌రికాన్ని క‌చ్చితంగా వ‌దులు కోవాల్సిందే. దీనికి రాకుమారి మ‌కో ఎప్పుడో ఒప్పుకొంది. అంతే కాకుండా ఆమెకు అధికారికంగా వ‌చ్చే రాజాభ‌ర‌ణం 150 మిలియన్‌ యెన్‌లను కూడా ఆమె వ‌దులు కొంది. వీట‌న్నింట‌కంటే ప్రేమ ముఖ్యం అని ఆమె చాటింద‌ని కొందరు మ‌ద్ద‌తు నిస్తుండగా ఆమె ప‌ని స‌రైంది కాద‌ని ప‌లువురు వాదిస్తున్నారు.
  Published by:Sharath Chandra
  First published: