జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటన వాయిదా...

భారత ప్రధాని నరేంద్ర మోడీతో శిఖరాగ్ర చర్చలు జరిపేందుకు మూడు రోజుల భారత్ పర్యటనకు అబే ఆదివారం రావలసి ఉంది.

news18-telugu
Updated: December 13, 2019, 10:56 PM IST
జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటన వాయిదా...
(ఫైల్ చిత్రం)
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య గువాహతిలో జరగాల్సిన వార్షిక శిఖరాగ్ర సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు భారతదేశం శుక్రవారం ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో శిఖరాగ్ర చర్చలు జరిపేందుకు మూడు రోజుల భారత్ పర్యటనకు అబే ఆదివారం రావలసి ఉంది. జపాన్ ప్రధాని అబే షిజో జరపాల్సిన మూడు రోజుల భారత్ పర్యటనను వాయిదా వేసేందుకు రెండు దేశాలూ నిర్ణయించాయి. పరస్పరం అనుకూలమైన తేదీని త్వరలో నిర్ణయిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఇఎ) ప్రతినిధి రవీష్‌కుమార్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే పౌరసత్వ చట్టంపై గువాహతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం గమనార్హం.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు