ఒకే సమయంలో 35 మందితో ప్రేమాయణం.. మాటలతో ముగ్గులోకి దించి డేటింగ్.. అందుకు కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ప్రతీకాత్మకచిత్రం

ఓ వ్యక్తి 35 మంది డేటింగ్ చేశాడు. ఒకే సమయంలో వారందరితో ప్రేమయాణం సాగించాడు.

 • Share this:
  ఓ వ్యక్తి 35 మంది డేటింగ్ చేశాడు. ఒకే సమయంలో వారందరితో ప్రేమయాణం సాగించాడు. అయితే ఇందుకు గల కారణం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇంతకు అతడు 35 మందితో డేటింగ్ ఎందుకు చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరి చదవాల్సిందే. వివరాలు.. జపాన్‌లో కాన్సాయి ప్రాంతానికి చెందిన మిమాగావా(Miyagawa) అనే వ్యక్తి వృత్తిరీత్యా సేల్స్‌మేన్‌గా పనిచేస్తున్నాడు.హైడ్రోజన్ వాటర్ షవర్ హెడ్స్‌ను విక్రయించే ఓ కంపెనీలో అతను పనిచేస్తున్నాడు. అతడు 35 మంది మహిళలను ప్రేమ బంధం నటించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వారికి మాయ మాటలు చెప్పేవాడు. ముఖ్యంగా వృద్ద, ఒంటరి మహిళలను అతడు లక్ష్యంగా చేసుకునేవాడు. పెళ్లి పేరుతో వారిని బుట్టలో వేసుకునేవాడు.

  ఇలా 35 మందితో మియాగావా డేటింగ్ చేశాడు. అయితే తన అసలు పుట్టిన తేదీ నవంబర్ 14 అయినప్పటికీ.. వారిలో ప్రతి ఒక్కరికి తన పుట్టిన రోజు తేదీలను వేర్వేరుగా చెప్పాడు. ఎందుకంటే ఏడాది పొడువునా ఎవరో ఒకరి నుంచి ఖరీదైన బర్త్ డే బహుమతులు సేకరించాడు. ఇలా మొత్తంగా భారత కరెన్సీలో దాదాపు 70 వేల రూపాయలు విలువచేసే బహుమతులను వారివద్ద నుంచి పొందాడు. అలాగే తాను పనిచేసే కంపెనీలో వస్తువులను వారిచేత కొనిపించేవాడు. అక్కడే వారిని కలుస్తుండేవాడు. ఇక, తాను వేరే మహిళలతో డేటింగ్ చేస్తున్న విషయం ప్రతి ఒక్క మహిళకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

  ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో మియాగావాతో డేటింగ్ చేస్తున్నవారిలో కొందరు మహిళలు అతడు వారిని మోసం చేస్తున్న విషయాన్ని గ్రహించారు. అనంతరం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వియాగావాను అరెస్ట్ చేశారు. బహుమతుల కోసం ఉద్యోగంలో టార్గెట్ చేరుకోవడం కోసం ప్రేమాయణం అనే డ్రామా ఆడినట్లు ఒప్పుకున్నాడు. కేవలం బర్త్ డే గిఫ్ట్‌ల కోసం 35 మంది మహిళలతో డేటింగ్ చేసిన మియాగావా వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యపరిచింది. ఒకే సమయంలో 35 మంది మహిళలతో డేటింగ్ చేసిన మియాగావాను కొందరు తిట్ల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇలా ఎలా మేనేజ్ చేశాడో అంటూ కామెంట్స్ పెడుతున్నాడు.
  Published by:Sumanth Kanukula
  First published: