Sail Solo Across Pacific : భూమిపై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని జపాన్ నావికుడు కెనిచి హోరీ ఒయాగడ్(83) ఒంటరిగా దాటేశాడు. అంత పెద్ద సాహసయాత్రను సోలోగా చేపట్టిన వృద్ధుడిగా ఆయన రికార్డు క్రియేట్ చేశాడు. జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి.
1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ఒంటరిగా ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా కెనిచి హోరీ ఒయాగడ్ పేరుగాంచాడు. 19 అడుగుల ప్లైవుడ్ బోటుపై అతను అప్పట్లో 94 రోజులు ప్రయాణించాడు. అయితే ఆసమయంలో పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడు మార్చి 27వ తేదీన కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్‌కో నుంచి ఆయన తన పడవలో బయలుదేరాడు.
ALSO READ Chicken In Coffee: కాఫీ ఆర్డర్ చేశాడు..తాగుతుంటే అందులో చికెన్ ముక్క కూడా..జొమాటో క్షమాపణ
శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. రెండు నెలల పాటు పసిఫిక్ సముద్రంలో ప్రయాణించిన ఆయన జపాన్‌లోని షికోకు దీవులకు చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున జపాన్‌లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగిసింది. 990 కిలోల బరువు ఉన్న సన్‌టోరీ మెరమెయిడ్ బోటులో ఆయన ప్రయాణం సాగింది. బోటు ప్రయాణ సమయంలో తన వద్ద ఉన్న శాటిలైట్ ఫోన్‌తో ప్రతి రోజు ఫ్యామిలీతో మాట్లాడేవాడు. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. వందేళ్లు వచ్చే వరకు కూడా ఇలాంటి ప్రయాణాలు చేయాలని నిశ్చయించుకున్నట్లు కెనిచి హోరీ చెబుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Japan, Pacific Ocean